CM Sri A Revanth Reddy unveiled ‘ Telangana Thalli’ statue in the Secretariat

Hon’ble Chief Minister Sri A Revanth Reddy unveiled ‘ Telangana Thalli’ statue in the Secretariat on Monday.

  • The mammoth gathering of all you is reflecting the flow of river Krishna and Godavari combined here. Extending heartfelt congratulations to all the participants in this program which will remain forever in the Telangana history.
  • Mother is the only identity of any part of the world and individuals. Mother is the embodiment of our culture and traditions.
  • Our culture was assaulted and also insulted in the erstwhile united Andhra Pradesh. After the formation of the Telangana state, one person and one political party gave priority to themselves and neglected the aspirations of Telangana people .
  • The decision to install Telangana Thalli statue was taken after discussing with cabinet colleagues to fulfill the aspirations of people in the people’s government.
  • The previous rulers decided to use TS instead of TG for vehicle registrations against the aspirations of the Telangana activists. It is the reason the people’s government decided to use TG for vehicle registration.
  • The famous ‘ Jaya Jaya he Telangana’ Song, which inspired us during the movement, has also not been declared as the state song for ten years. The People’s government declared the song as Telangana song. The felicitation of famous poet Andesri in the secretariat will be remembered as a great memory for my lifetime.
  • Various political parties created different forms of Telangana Thalli statues. However, the image of Telangana Thalli has not been officially declared till the date. The people’s government officially declared the mother of the masses as Telangana Thalli.
  • The Telangana Thalli statue inspires us as a replica of our own mother. December 9 is an auspicious day and festival day.
  • Today, we are organizing this program like a festival so that all our thoughts should be surrounded by Telangana Thalli. Moving Telangana forward from crisis to welfare, corruption to development and reconstruction of the state . Government decided to recognize, honor and support the poets who lost everything for Telangana. Guda Anjaiah, Gaddar, Bandi Yadagiri, Andesri, Goreti Venkanna, Suddala Ashok Teja, Jayaraju, Pasham Yadagiri and Ekka Yadagiri Rao have been recognized. Government will provide them with a 300-yard house plot and a cash prize of Rs. 1 crore with a felicitation letter to all of them.
  • Telangana was not achieved for the sake of a family or a political party. Faced humiliation in the erstwhile united AP. We are also neglected for ten years in Telangana state. Government will organize Telangana Thalli celebrations on December 9 every year so as not to recur such humiliation and neglect in the future.

 

 

ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.
  • తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు.
  • డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ…
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు తెలంగాణ తల్లి రూపం ఇలా ఉండాలని గానీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయాలని గానీ ఏ రోజూ ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
  • తెలంగాణ సాకారమైన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయని ఆశించాం. మన సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది. మన తల్లిని గౌరవించుకుంటామని ఆశించాం.
  • ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు యువకులు తాము నడిపే వాహనంపై టీజీ అని రాసుకోవడమే కాకుండా గుండెలపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీజీ అని మార్చాం.
  •  తెలంగాణ ఉద్యమ కారులకు స్ఫూర్తినిచ్చి నిలబడ్డ అందేశ్రీ గారి గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య పాలనలో ఎన్నోసార్లు చెప్పుకున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక అది జరగలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గేయాన్ని అధికారిక గేయంగా ప్రకటించుకున్నాం.
  • కవి గూడ అంజయ్య గారు, ప్రజా కవి గద్దర్ గారు, బండి యాదగిరి గారు, గోరటి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజ గారు, పైడి జయరాజ్ గారు, పాశం యాదగిరి గారు, ఎక్కా యాదగిరి గారి లాంటి ఎందరో తెలంగాణ ప్రముఖులను లేదా వారి కుటుంబాలను సన్మానించాలని నిర్ణయించాం. వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల చొప్పున స్థలంతో పాటు కోటి రూపాయల నగదు, తామ్రపత్రం బహుమతిగా అందజేస్తాం.
  • ప్రతి ఏటా తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్న రోజును (డిసెంబర్ 9 న) ఒక పండుగలా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తాం.
  • భవిష్యత్తులో తెలంగాణ తల్లి నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని ప్రయత్నం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
  •  ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, డీజీపీ జితేందర్ గారితో పాటు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అదికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.