Telugu Journalists meet CM Sri Revanth Reddy, Commend Progressive Welfare Initiatives for Media Community.
A delegation of Telugu journalists stationed in New Delhi called on Hon’ble Chief Minister Sri A. Revanth Reddy during his recent visit to the capital. The journalists expressed their gratitude for the various welfare measures being initiated by the Telangana government for the journalist community.
During the meeting, the journalists thanked the Chief Minister for his ongoing efforts to address key concerns such as housing, health cards, and accreditation for journalists. They especially appreciated the government’s commitment to sanctioning Rs 10 crore to the Media Academy from the Special Development Fund, aimed at resolving longstanding issues faced by the media fraternity.
The Chief Minister reiterated his government’s resolve to protect and promote the welfare of genuine journalists and assured the delegation that all necessary steps would be taken to support the professional growth and security of the media community. He also emphasized that his administration is committed to building trust within the system, and that journalists, as an essential part of this system, will continue to be supported in their efforts to uphold the values of responsible journalism.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపిన ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డిని గురువారం కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా సీఎం రేవంత రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇండ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పదికోట్లు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది.
జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.