- ITIs/ATCs and Polytechnic Colleges to come under Young India Skill University
Chief Minister Sri A Revanth Reddy asked the officials to introduce courses in the ITI institutions to suit the industry and market requirements. The authorities are directed to constitute a Committee to design the required syllabus for the respective courses and seek suggestions and advice from experts and academicians.
CM Revanth Reddy held a review with the state Labour and Employment department officials at the State Secretariat on Saturday. The CM suggested that every existing ITI college in the state should have principals and ensure that the trainees get comprehensive training. The Chief minister ordered the officials to regularly monitor and inspect the ITI colleges. The Chief Minister suggested the officials come out with a proposal to set up new ATCs in the Polytechnic colleges in the state. The officials have been asked to identify the assembly constituencies that did not have the ITI/ATCs in the state and submit a report. The Chief Minister wanted the establishment of ITI/ATCs in 100 Assembly Constituencies except Hyderabad city and directed the officials to finalize modalities to bring the ITI/ATC and Polytechnic colleges under the purview of Young India Skill University.
State Chief Secretary Santhi Kumari, Labour wing Secretary Sanjay Kumar, Chief Minister’s Special Secretary Ajith Reddy, TGIIC MD Vishnuvardhan Reddy and other officials participated in the meeting.
మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులు
- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు
- ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తలు సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని సూచించారు. ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ/ ఏటీసీ లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.