Telangana Govt. announces bonus for Singareni workers

  • Festive cheers among coal workers before Dussehra
  • Singareni company will pay Rs. 796 crores bonus
  • Rs 1.90 lakh bonus for permanent employees
  • First time, contract workers will get a Rs 5,000 bonus

Chief Minister Sri A Revanth Reddy announced the ‘Dussehra’ bonus for Singareni workers to bring happy moments among the Coal workers even before the beginning of the festivities. The CM said that the bonus is being paid to the Coal workers from the profits earned by the Singareni Collieries Company Limited (SCCL) last year. Each permanent worker will get a Rs 1.90 lakh bonus and Rs 5,000 will be paid as a bonus to the contract workers.

Addressing the press at Secretariat on Friday, CM Revanth Reddy praised the Singareni workers for playing a key role during the intensified Telangana movement and commended their contribution to the achievement of a separate Telangana State.

Explaining the details of the Singareni company’s profits, expansion plans and bonus, Deputy Chief Minister Bhatti Vikramarka said that the SCCL has been supplying coal to thermal power generation plants, and other companies in the state and also exporting to other states. The company has earned a net profit of Rs 4,701 crore in the 2023-2024 financial year. Out of this, Rs 2,289 crore has been allocated for the expansion of the company and other investments.

In the remaining Rs 2,412 crore profits, the company earmarked Rs 796 crore to pay bonuses to the coal workers. A total of 41,387 permanent employees are working in the company. Each worker will get a Rs 1.90 lakh bonus. Last year, the employees got only Rs 1.70 lakh bonus. This year, each employee will get a Rs 20,000 bonus additionally.

Bonus For Contract Workers

For the first time in the history of Singareni company, the state government announced a bonus for the contract workers. At present, 25,000 contract workers are working in the company. Deputy Chief Minister Bhatti Vikramarka said that each employee will get a Rs 5,000 bonus before the Dussehra festival this year.

Government rolls out Singareni expansion plans

Bhatti Vikramarka said that the state government decided to invest the profits earned by the Singareni company for future needs. The government envisaged plans for the expansion of solar power plant to 1000 MW, construction of 500 MW pumped storage plant at Ramagundam, another 1×800 MW thermal power plant at the existing thermal power plant at Jaipur, 1×800 MW thermal power plant at Ramagundam jointly with TSGENCO and set up a supercritical thermal power plant with a capacity of 2,400 MW at Naini coal block ( pit head) in Odisha.

The SCCL will also start operations at VC open cast, Goleti and Naini OCs. The establishment of new residential schools for Singareni workers and employees’ children, integrated schools, modernization of area hospitals and establishment of a multi-specialty hospital in Hyderabad will be the new initiatives which are being taken by the company for the welfare of the workers.

Ministers Uttam Kumar Reddy, Damodar Raja Narasimha, D Sridhar Babu, Tummala Nageswara Rao, Komatireddy Venkat Reddy, Seethakka, Ponguleti Srinivas Reddy, Konda Surekha, Ponnam Prabhakar, Jupalli Krishna Rao, State Planning Board Vice President Chinnareddy, Zaheerabad MP Suresh Shetkar, Singareni Region MLA s -Gaddam Vinod, Makkan Singh Raj Thakur, Premsagar Rao, Singareni MD Balaram, leaders of trade unions Vasireddy Sitaramaiah, Janak Prasad and others are present.

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌

  • ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌
  • కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు
  • ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు
  • తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌

సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల ఆధారంగా బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు, కాంట్రాక్ట్ కార్మికుల‌కు రూ.5 వేలు చొప్పున బోన‌స్ ప్ర‌క‌టించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ప్ర‌క్రియ‌లో సింగ‌రేణి కార్మికులు అగ్ర‌భాగాన నిలిచార‌ని, ఉద్యమాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ల‌డంతో గ‌ని కార్మికుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. అనంత‌రం సింగ‌రేణి లాభాలు, విస్త‌ర‌ణ‌.. బోన‌స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క విలేక‌రుల‌కు వివ‌రించారు.

రాష్ట్రానికే త‌ల‌మానికంగా ఉన్న సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు బొగ్గు ఎగుమ‌తి చేస్తోంది. సింగ‌రేణి కార్మికుల శ్ర‌మ‌తో 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ‌, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించ‌గా మిగిలిన‌వి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు రూ.796 కోట్ల‌ను కార్మికుల‌కు బోన‌స్‌గా ప్ర‌క‌టిస్తున్నాం. సింగ‌రేణిలో మొత్తం 41,387 మంది శాశ్వ‌త కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకొక్క‌రికి బోన‌స్ కింద రూ.1.90 ల‌క్ష‌లు అందించ‌నున్నాం. గ‌తేడాది సింగ‌రేణి కార్మిల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 ల‌క్ష‌లు మాత్ర‌మే. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకొక్క‌రికి అద‌నంగా అందుతున్న మొత్తం రూ.20 వేలు.

కాంట్రాక్ట్ కార్మికుల‌కూ బోన‌స్

సింగ‌రేణి సంస్థ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం బోన‌స్ ప్ర‌క‌టించింది. సంస్థ‌లో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ప‌ని చేస్తున్నారు. వారంద‌రికీ తొలిసారిగా రూ.5 వేల బోన‌స్‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క తెలిపారు. ద‌స‌రా పండ‌గ‌కు ముందే ఈ మొత్తాన్ని వారికి అంద‌జేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

విస్త‌ర‌ణే ల‌క్ష్యంగా

సింగ‌రేణి సంస్థ ఆర్జించిన లాభాల‌ను భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. దాని ప్ర‌కారం సోలార్ విద్యుదుత్ప‌త్తి కేంద్రాన్ని 1000 మెగావాట్ల‌కు విస్త‌రించ‌డం, రామ‌గుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్‌లోని ప్ర‌స్తుత థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రంలో మ‌రో 1×800 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌ల మ‌రో థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం, రామ‌గుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వ‌ర్యంలో మ‌రో 1×800 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్‌) 2,400 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన సూప‌ర్ క్రిటిక‌ల్ థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి తెలిపారు.

సంస్థ ప‌రిధిలోని వీకే ఓపెన్ కాస్ట్‌, గోలేటీ, నైనీ ఓసీల‌ను ప్రారంభిస్తామ‌ని, సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగుల పిల్ల‌ల కోసం నూత‌న రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌, ఏరియా ఆసుప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌తో పాటు హైద‌రాబాద్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

విలేక‌రుల స‌మావేశంలో మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సీత‌క్క‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, జూప‌ల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు చిన్నారెడ్డి, జ‌హీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, సింగ‌రేణి ప్రాంత ఎమ్మెల్యేలు గ‌డ్డం వినోద్‌, మ‌క్క‌న్ సింగ్ రాజ్ ఠాకూర్‌, ప్రేమ్‌సాగ‌ర్‌రావు, సింగ‌రేణి ఎండీ బ‌లరాం, కార్మిక సంఘా ల నాయ‌కులు వాసిరెడ్డి సీతారామ‌య్య‌, జ‌న‌క్ ప్ర‌సాద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.