Vivint Pharma, an injectables pharmaceutical company, has announced its plans to establish a state-of-the-art injectables manufacturing facility in Genome Valley, Hyderabad. The company will be investing ₹400 crores in the new facility with the potential to employ 1000 people, further solidifying Telangana’s position as a global hub for life sciences.
The announcement was made during a high-level meeting with the Hon’ble Chief Minister of Telangana, Shri A. Revanth Reddy, and the Minister for Industries and Commerce, Sri D. Sridhar Babu, in the United States. This significant investment underscores Vivint Pharma’s commitment to expanding its footprint in India, particularly in Telangana, which has emerged as a preferred destination for pharmaceutical and biotechnology companies.
The company has an R&D center in Genome Valley and has invested about Rs. 70 crores in the facility. To consolidate its strengths and foray into international markets, the company has decided to establish its first manufacturing plant and has acquired 5.5 acres in Genome Valley, known for its world-class infrastructure and conducive ecosystem for research, innovation, and manufacturing.
Sri A. Revanth Reddy, Hon’ble Chief Minister of Telangana said, “I am delighted to note about Vivint Pharma’s investment in Genome Valley. Telangana has always been at the forefront of fostering innovation in the life sciences sector, and this investment will add further impetus.”
Sri D. Sridhar Babu, Minister for Industries and Commerce, Telangana, also expressed his enthusiasm, stating, “This investment is a testament to the business-friendly environment nurtured by our Government. Genome Valley continues to be a magnet for pharmaceutical companies, and Vivint Pharma’s decision to set up a new manufacturing facility here reaffirms our leadership in the life sciences domain.”
Vivint Pharma’s injectables facility will focus on the development and production of high-quality injectable drugs in the oncology and critical care space for both domestic and international markets. The company’s decision to invest in Genome Valley aligns with its strategy to leverage India’s skilled workforce and the region’s advanced manufacturing capabilities to meet the growing global demand for pharmaceutical products.
వివింట్ ఫార్మా విస్తరణ
- జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడులు
- కొత్తగా ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్.. వెయ్యి మందికి ఉద్యోగాలు
తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రపంచంలో పేరొందిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది.
ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే లైఫ్ సైన్సెస్‌కు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో ఈ కంపెనీ పెట్టుబడులకు సిద్ధపడటం అందరినీ ఆకర్షిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ రీసేర్చ్ అండ్ డెవెలప్మెంట్ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా వివింట్ కంపెనీ హైదరాబాద్‌లోనే తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. పరిశోధన, ఆవిష్కరణ కేంద్రంతో పాటు తయారీ యూనిట్, మౌలిక సదుపాయాల కల్పనకు జీనోమ్ వ్యాలీలో 5.5 ఎకరాలను కొనుగోలు చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు”.
తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో కొత్త కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, వివింట్ ఫార్మా కొత్త తయారీ కేంద్రం ఏర్పాట్లు తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి దోహదపడుతుందన్నారు.
ప్రధానంగా అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల్లో అత్యంత నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీకి అధునాతన తయారీ సామర్థ్యాలతో పాటు దేశంలోని నిపుణులకు ఉపాధినిచ్చేలా ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది.