CM attended Greater Warangal Municipal Corporation (GWMC) review meeting

CM Revanth Reddy’s Speech Points

Wanted to develop Warangal on par with Hyderabad. Instructing the officials to take required steps to develop Warangal as a heritage city. Complete land acquisition for Inner and Outer Ring Road. Furnish the full details regarding funds required for land acquisition.

Instructed officials to prepare a “Master Plan -2050” for the integrated development of the Warangal city .

Suggests to develop the proposed Outer Ring Road to connect one national highway with another national highway. Ensure that a road is developed to connect from outer ring road to Textile park

Asks officials to prepare plans to develop an underground drainage system under Smart City mission. Officials have been directed to make plans for laying drinking water pipelines. Take all measures to prevent the encroachment of Nalas.

In-charge minister should hold a review on the development of Warangal city every 20 days. Government is ready to extend help for the development of the city . Find out permanent measures for the dumping problem in Warangal. The authorities have been asked to come out with plans in this direction.

వరంగల్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..

  • హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్న సీఎం.
  • హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.
  • ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.
  • భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశం.
  • నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించిన సీఎం.
  • ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్న సీఎం.
  • స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం.
  • డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
  • నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం.
  • వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన సీఎం.
  • నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న సీఎం.
  • వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.
  • ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం.