Appeal to Union Minister for including CSMP under AMRUT 2.0

Hyderabad CSMP to be included in AMRUT 2.0 – Chief Minister Sri Revanth Reddy’s appeal to Union Minister Sri Khattar for support on Metro Rail Phase 2.

Chief Minister of Telangana, Sri Revanth Reddy, has appealed to Union Minister for Housing and Urban Affairs, Sri Manohar Lal Khattar, to include Hyderabad’s Comprehensive Sewerage Master Plan (CSMP) under AMRUT 2.0 or consider it as a special project. The Chief Minister met Union Minister Khattar on Monday in Delhi, explaining that Hyderabad’s historic city is still operating with an outdated sewerage system, which is inadequate for present needs. He further brought to the Minister’s attention the lack of proper sewerage systems in nearby municipalities.

Highlighting the need for Hyderabad and its surrounding municipalities to achieve 100% wastewater treatment to maintain the city’s global standards of living, CM Revanth Reddy informed the Union Minister that a DPR (Detailed Project Report) has been prepared for the CSMP, covering Hyderabad and 27 nearby municipalities. The plan spans 7,444 kilometers with an estimated cost of ₹17,212.69 crore. The Chief Minister handed over the DPR to Minister Khattar, requesting financial assistance through AMRUT 2.0 or by recognizing it as a special project.

The Chief Minister also emphasized that the Musi River runs for 55 kilometers through Hyderabad, with 110 kilometers of sewage draining into the river. To prevent this, a DPR has been prepared for constructing trunk sewers, large-size box drains, and new sewage treatment plants at a cost of ₹4,000 crore. The Chief Minister submitted this DPR to the Union Minister, seeking approval and swift permission to commence the work.

Regarding the expansion of Hyderabad Metro Rail Phase 2, CM Revanth Reddy informed Minister Khattar that DPRs have been completed for several corridors, including Nagole to Shamshabad Rajiv Gandhi International Airport (36.8 km), Raidurgam to Kokapet Neopolis (11.6 km), MG Bus Station to Chandrayangutta (7.5 km), Miyapur to Patancheru (13.4 km), and LB Nagar to Hayathnagar (7.1 km), totaling 76.4 kilometers. The estimated cost of the expansion is ₹24,269 crore. CM Revanth Reddy proposed a 50:50 joint venture between the central and Telangana governments to undertake these corridors, assuring that the DPR for the project will be submitted soon and requesting the Union Minister’s cooperation for its prompt implementation.

Accompanying the Chief Minister were MPs from Nalgonda, Bhongir, and Peddapalli, Raghuveer Reddy, Chama Kiran Kumar Reddy, and G. Vamsikrishna, Telangana Government’s Special Representative in Delhi, AP Jitender Reddy, State Government Advisor Srinivas Raju, Chief Secretary Shanti Kumari, CM’s Principal Secretary V. Seshadri, Principal Secretary for Urban Development, Dana Kishore, Hyderabad Metro Rail MD NVS Reddy, and Telangana Bhavan Resident Commissioner Gaurav Uppal.

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి

  • మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి…
  • కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను (సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. చారిత్ర‌క హైద‌రాబాద్ న‌గ‌రంలో పురాత‌న మురుగుశుద్ధి వ్య‌వ‌స్థ‌నే ఉంద‌ని, అది ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. హైద‌రాబాద్ స‌మీప‌ పుర‌పాల‌క సంఘాల్లోనూ స‌రైన మురుగు నీటి పారుద‌ల వ్య‌వ‌స్థ లేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి ఆయ‌న తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌లో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు ప్ర‌పంచ స్థాయి నగ‌రంలో మాదిరి ఉండాలంటే న‌గ‌రంతో పాటు స‌మీప మున్సిపాలిటీల్లో 100 శాతం ద్ర‌వ వ్య‌ర్థాల శుద్ధి చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌తో పాటు స‌మీప 27 పుర‌పాల‌క సంఘాల‌తో క‌లుపుకొని క‌లిపి 7,444 కి.మీ.మేర రూ.17,212.69 కోట్ల‌తో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించిన‌ట్లు ఖ‌ట్ట‌ర్‌కు సీఎం తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అంద‌జేశారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక స‌హాయం చేయ‌డం లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో 55 కి.మీ. మేర మూసీ న‌ది ప్ర‌వ‌హిస్తోంద‌ని, ఇరువైపులా క‌లిపి 110 కి.మీ.మేర న‌గ‌రంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోంద‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా మురుగు మూసీలో చేర‌కుండా ఉండేందుకు ట్రంక్ సీవ‌ర్స్ మెయిన్స్‌, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవ‌రేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్ల‌తో డీపీఆర్ రూపొందించిన‌ట్లు కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌ర్పించారు. ఆ డీపీఆర్‌ను ఆమోదించ‌డంతో పాటు ప‌నుల‌ అనుమ‌తికి చొర‌వ చూపాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి నాగోల్-శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (36.8 కి.మీ.), రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్త‌యిన‌ట్లు కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 వ్య‌యం అవుతుంద‌ని అంచనా వేశామ‌ని, దీనిని కేంద్రం, తెలంగాణ ప్ర‌భుత్వం 50:50 రేషియోలో జాయింట్ వెంచ‌ర్‌గా చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను స‌మ‌ర్పిస్తామ‌ని.. అది త్వ‌ర‌గా కార్య‌రూపం దాల్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్య‌మంత్రి వెంట న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, జి.వంశీకృష్ణ‌, ఢిల్లీలో తెలంగాణ‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిశోర్‌, హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ ఉన్నారు.