CM handed over job appointment orders to the newly recruited AEEs

Chief Minister Sri A Revanth Reddy handed over job appointment orders to the newly recruited AEEs in the State Irrigation department at Jala Soudha on Thursday in Hyderabad.

Telangana state has been formed to fulfill the aspirations of people who fought for water and jobs. Water is one of the important parts of Telangana culture. All the newly recruited persons are appointed as the representatives of the important irrigation department in the state.

The present government is going fast in the recruitment process after a decade of the formation of the Telangana State. Getting a job is also an emotion for all. The emotions of Telangana people are connected with water. It is your responsibility to respect the people’s emotions and utilize water judiciously for the state needs.

Officials who acquire field experience will only excel in their profession. Leaders also become successful politicians and rulers who only visit the field regularly. Leaders like PV Narasimha Rao, Kotla Vijaya Bhaskar Reddy and Neelam Sanjeeva Reddy rose from the level of Sarpanch to Chief Ministers and also Prime Ministers. I also came from a Zilla Parishad member to the level of CM.

Earlier, engineers used to go to the field inspection in the early morning and write the reports. These days, the officials have stopped visiting the field. The People’s Government already ordered the officials to conduct field visits regularly.

The previous government spent crores of rupees on the construction of the Kaleshwaram project but the structure collapsed. The officials should come out and tell who is responsible for this. Is it officials or politicians? Kaleshwaram is the perfect example for a model study.

Consider the famous engineer Mokshagundam Vishveshwariah, who constructed Usman Sagar and Himayat Sagar as a role model for all irrigation engineers. The entire irrigation department had to be dissolved if the government took action against those responsible for the Kaleshwaram fiasco. The government will have to face criticism if action is not taken. The engineers from EE and SE levels are leveling allegations against each other.

Such situations would not have arisen if the wrong decisions taken by the politicians were not implemented. The Kaleshwaram is not providing irrigation facilities even to one lakh acres even after spending one lakh crore on the lift scheme.

Appealing to the officials to probe the reasons for not completing the pending projects for the last 10 years. Rs 2 lakh crore were spent on the projects and the works are still pending. It should not be repeated in the future.

Water is the most precious resource in the reconstruction of the Telangana state. All officials should work at the field level to complete the projects.

As a punishment, send the officials, who have been appointed on recommendation, to distant places. Officials should focus on the work and not postings. Telangana will be a role model for the country once all the pending projects are completed.

జలసౌధ ప్రాంగణంలో AEE లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం

AEE లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
  • నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు.
  • తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
  • ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం.
  • తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది..
  • వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది..
  • ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు..
  • రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.
  • పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు.
  • నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా..
  • గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు..
  • ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు..
  • కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు..
  • మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం.
  • కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి..
  • దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి..
  • అధికారులనా? రాజకీయ నాయకులనా?
  • మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ.
  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి..
  • కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్ మెంటే ఉండదు..
  • చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
  • ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు..
  • రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు..
  • లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు..
  • పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి..
  • 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు..
  • భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు..
  • తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం..
  • ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి..
  • రికమెండేషన్ తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి..
  • పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్ ల మీద కాదు..
  • అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది.
  • క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి..