న్యాయ శాఖ ప్రధానంగా సచివాలయంలోని అన్ని విభాగాలకూ న్యాయసంబంధమైన అంశాల్లో ఒక సలహా విభాగం. అది ముసాయిదా ఆదేశాలనూ, నోటిఫికేషన్లనూ, నియమాలనూ, నిబంధనలనూ, నియంత్రణలనూ, ఒప్పందాల (చట్టబద్ధమైనవీ, చట్టబద్ధం కానివీ) నియమాలనూ, ఆదేశాలనూ, ముసాయిదాలనూ, చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు సంబంధించిన ముసాయిదా పనులనూ, శాసనసంబంధమైన అంశాల్లో ఆర్డినెన్సులనూ పరిశీలిస్తుంది. న్యాయశాఖ కార్యకలాపాలను ప్రభుత్వ బిజినెస్ రూల్స్ లోని 41 నుంచి 56 కింద పర్యవేక్షించడం జరుగుతుంది.
శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.