CM launched MSME Policy- 2024

Chief Minister Sri A Revanth Reddy unveiled the MSME policy -2024 on Wednesday.

CM Revanth Reddy’s Speech Highlights:

It is required to promote the MSMEs (Micro, Small and Medium Enterprises ) to generate more employment opportunities in the Telangana state. Today, the government announced the MSME Policy-2024 aiming to increase the wealth of the state.

Former Prime Minister PV Narasimha Rao took many initiatives to overcome the financial crisis faced by the country with foresight. PVNR introduced economic reforms and liberalized industrial policies to bring the Indian economy on the right track. The former PM brought the policies to compete with India with the world.

Minister Sridhar Babu is the brain behind introducing the MSME policy to promote micro, small and medium industries. Sridhar Babu’s efforts are commendable. Without a policy document, no state will develop. It is the reason the government announced the MSME Policy.

State government introduced the new policy while continuing the policies of the previous government. Politics will not take place in the development process hence it is a continuous process. The Congress party will pursue the good programs and schemes without giving any scope to politics. My government will also not hesitate to scrap the earlier decisions which are detrimental to the state’s interest.

There is a big gap between the educational standards and the industrial requirements. It is the reason 65 ITI institutions have been upgraded as advanced technology centers. Modernizing the institutions jointly with Tata Institute at a cost of Rs.2400 crores.

Young India Skill University has been established after conducting a thorough study. The university will train the youth and impart skills to meet the industrial requirements.

Government will set up a Corpus fund with Rs 300 crore to Rs 500 by seeking donations from the Industrialists for the management of the University. Government finalized modalities to spend the funds for the maintenance of the university. This initiative is not for political gains.

Government waived off the farm loans up to Rs 2 lakh and proved that practicing agriculture is a festival to the farmers. However, the income generated from agriculture is not sufficient for the peasants’ families.

Appealing to the farmers not to give up farming since it is our part of culture. Farmers are requested to continue in the profession and encourage their family members to grab the employment opportunities. All should grow to excel in the business.

Future City is coming up in Hyderabad. Will set up Life Sciences and Greenfield Pharma city in the Future city.

Musi river will be developed as a man made wonder by removing the impression of the river a dirty pool.

State government is not functioning from the ‘restricted Fort’ ( Gadi) like the previous government. It is the People’s government for the welfare of all people. Doors are always open in our government and ready to accept everyone’s suggestions.

Envisaged plans to promote the women Self Help Groups ( SHGs) as Millionaires. A new marketing facility has already created to promote the products of the SHGs on 3 acres of land at the famous Shilparamam in Hyderabad. SHGs have been entrusted with the responsibility of the management of the Amma Adarsh Schools and also gave orders to the groups for stitching the school uniforms. The women groups are supported by increasing the charges of the stitching of uniforms to Rs 75 from Rs 25.

More employment opportunities will be generated in the state only with strengthening of the MSMEs. Government will provide all out support to the MSMEs in the state.

MSME పాలసీ- 2024ను ఆవిష్కరించిన సీఎం

MSME పాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు MSME లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
  • రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం.
  • దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో వ్యవహరించారు.
  • పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారు.
  • ప్రపంచంతో పోటీ పడేలా విధి విధానాలు తీసుకొచ్చారు.
  • సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం.
  • పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు.
  • అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
  • గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే… కొత్త పాలసీని ముందుకు తీసుకెళతాం.
  • ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు..
  • కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించింది..
  • మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు.
  • రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదు..
  • ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడింది..
  • అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం..
  • టాటా ఇనిస్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం.
  • పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం..
  • ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇందులో శిక్షణ ఇవ్వనున్నాం
  • యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తలు నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం
  • వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది.
  • ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.
  • రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించాం..
  • అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడంలేదు..
  • తెలంగాణ రైతాంగానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..
  • వ్యవసాయాన్ని వదలొద్దు.. అగ్రికల్చర్ అనేది మన కల్చర్..
  • వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే ఇతర కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాలవైపు ప్రోత్సహించండి..
  • వ్యాపారాల్లో రాణించేలా ఎదగాలి..
  • హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం
  • ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నాం
  • మూసీ అంటే మురికి కోపం కాదు… మూసీ ని మ్యాన్ మేడ్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నాం..
  • మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదు..
  • ఇది ప్రజల కోసమే పని చేసే ప్రజా ప్రభుత్వం..
  • మా ప్రభుత్వంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి..
  • అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
  • మా ప్రభుత్వం స్వయంసహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తోంది.
  • శిల్పారామంలో 3ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నాం..
  • అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ మహిళల చేతుల్లోపెట్టాం..
  • మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చాం..
  • యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్ధికంగా ఆదుకుంటున్నాం..
  • MSMEలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి..
  • MSMEలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది.