CM invites Union Ministers for Sept 17 Telangana Praja Palana Dinotsavam

Chief Minister Sri A. Revanth Reddy has written to Union Home Minister Sri Amit Shah, cordially inviting him to kindly grace the Telangana Praja Palana Dinotsavam, as a special guest, to celebrate the anniversary of the arrival and heralding of democracy on Hyderabad soil. CM Reddy also wrote letters to Union Ministers Sri Gajendra Singh Shekhawat and Sri G. Kishan Reddy, and Minister of State Sri Bandi Sanjay Kumar, inviting them to be guests at the program. The program would commence at 10 am at Public Gardens on Sept 17.

తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకండి

  • కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, శ్రీ గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌, శ్రీ కిష‌న్ రెడ్డి, శ్రీ సంజ‌య్‌ల‌కు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆహ్వానం

తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌, కేంద్ర గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం లేఖ‌లు పంపించారు. 1948, సెప్టెంబ‌రు 17న తెలంగాణ‌లో ప్ర‌జాస్వామిక పాల‌న శ‌కం ఆరంభ‌మైన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. హైద‌రాబాద్ నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి కోరారు.