CM announces transgender-specific government recruitment cum social welfare program

  1. Chief Minister Sri A. Revanth Reddy announces Independent India’s first ever transgender-specific government recruitment cum social welfare program
  2. The move is without parallels not only in India but anywhere across the world
  3. Best example of creative and lateral thinking in governance – attempts to solve two crucial problems simultaneously
  4. Hyderabad has the least traffic jams, and problems amongst India’s Big Five Cities – the move will help further make it the best-in-class exemplar
  5. Post identification, recruitment and training, traffic support from troops raised exclusively from transgenders will support Hyderabad traffic police

  1. స్వాతంత్య్ర భార‌త దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండ‌ర్ల సంక్షేమం, వారి కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.
  2. ట్రాన్స్‌జెండ‌ర్ల విషయంలో ఇంత‌టి కీల‌క‌మైన అడుగు భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేదు..
  3. ఇది పాలనలో సృజనాత్మకమైన ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ – రెండు కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నం.. (ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ఉపాధి క‌ల్ప‌న‌, హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం)
  4. భారతదేశంలోని అయిదు పెద్ద న‌గ‌రాల్లో హైద‌రాబాద్‌లోనే అతి తక్కువ ట్రాఫిక్ జామ్ స‌మ‌స్య ఉంది. ముఖ్య‌మంత్రి తీసుకున్న చ‌ర్య‌తో ఈ స‌మ‌స్య మ‌రింత‌గా త‌గ్గి ట్రాఫిక్ త‌గ్గింపున‌కు ఉత్తమ ఉదాహరణగా మారేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.
  5. ట్రాన్స్‌జెండ‌ర్ల గుర్తింపు, నియామ‌కం, శిక్షణ తర్వాత, ఈ ట్రాన్స్‌జెండ‌ర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండ‌గా నిలుస్తారు.
  6. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్ర‌గ‌తిశీల‌క చ‌ర్య ఆడ‌, మ‌గా, ట్రాన్స్‌జెండ‌ర్ అనే వివ‌క్ష లేద‌నేందుకు అత్యుత్త‌మ ఉదాహార‌ణ‌గా నిలుస్తోంది.