Praja Palana from September 17

  • The program will be held for 10 days
  • The main agenda is to issue new Ration cards and Health cards
  • Study ‘France Policy’ to issue Digital Health Cards

Chief Minister Sri A Revanth Reddy decided to hold the ‘Praja Palana’ program for 10 days from September 17 in the state. This time, the Praja Palana program is being organized to issue new Ration Cards and Health Cards to all eligible persons. Under the new policy, the ration cards will be delinked with health cards and issue the two cards separately. The Chief Minister ordered the officials to collect the details of every family during the 10 day program and make necessary arrangements to organize the Praja Palana in all villages and wards across the state.

CM Sri Revanth Reddy held a review meeting at the Secretariat on Tuesday, attended by state Health Minister Sri Damodara Raja Narsimha, Chief Secretary Smt. Santhi Kumari, Principal Secretary of Health Department Dr. Christina Chongtoo, Principal Secretary of Municipal Department Sri Dana Kishore and Principal Secretary to CM Sri Seshadri.

The CM asked the officials of the Medical and Health department to make decisions on the procedures required to issue health digital cards, medical tests to record the health profile of everyone, establishment of health checkup camps in the villages and seeking the help of laboratories in the state.

The Chief Minister said that the representatives who met him during the recent foreign visit said that France adopted the best policy for issuing digital health cards and advised the officials to study the policy. Henceforth, the health cards which are being issued by the state government will only be considered for providing medical treatment under Rajiv Arogyasri and also the assistance extended from the CMRF.

Warns suspension of health officials
CM Revanth Reddy directed the officials to be vigilant in view of increasing cases of seasonal diseases and expressed concern over rising Dengue, Chikungunya and other viral fever cases in the state. The officials have been asked to take appropriate preventive measures before the spread of fevers and diseases.

The Chief Minister asked the officials to intensify fogging and spraying to eradicate the mosquito menace in all Towns and Villages along with Greater Hyderabad. The CM ordered that fogging is being done regularly in all areas under the GHMC limits and the officials conduct a field level visit and inspection regularly. The CM warned that the employees who are indifferent to protecting public health will be suspended from the services.

The CM ordered the officials under the GHMC jurisdiction, Medical and Health officials and the district collector to work in tandem to curb seasonal diseases. The Chief Minister appealed to seek the help of the Police, Voluntary organization and Media to educate people about seasonal diseases. Collectors and Panchayat Raj officials in all districts have been directed to take up a special drive to prevent the spread of seasonal diseases immediately. Collectors are advised to make field visits in all villages and towns to ascertain the situation from time to time. The officials have been asked to visit the areas where Dengue and Chikungunya cases have been reported, find out the reasons and take necessary sanitation programs.

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

  • పది రోజుల పాటు కార్యక్రమం
  • రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా
  • అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి… ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా… రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా…? వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు.

ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్:

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం హెచ్చరించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.