Milad-un Nabi procession on September 19

  • Milad Committee responds positively to the government‘s appeal

The representatives of the Milad Un Nabi Committee agreed to hold the Milad-un-Nabi procession on September 19 and decided to organize Prophet Mohammad’s birthday celebrations on a grand scale on September 16.

Chief Minister Sri A Revanth Reddy held a review on Milad Un Nabi arrangements at the State Secretariat on Thursday. On this occasion, the issue of Ganesh Navaratri festival from September 7 to September 17 is discussed in the meeting. The Chief Minister and the Ministers suggested to the members of the Milad Committee to consider the possibility of postponing the Milad Un Nabi procession. Ministers Ponnam Prabhakar, Sridhar Babu, Adviser to Chief Minister Vem Narender Reddy, and MIM Floor Leader Akbaruddin Owaisi have been entrusted with the responsibility of discussing the issue with the Milad Committee. After a separate meeting, the members of the committee responded positively to the government’s request to postpone the procession.

The members of the Milad Un Nabi Committee said that the 1499th birth anniversary of Prophet Mohammad will be held on September 16 and requested the CM to permit them to organize year long celebrations of the Prophet’s 1500th birthday next year. The Chief Minister said that the government will give permissions as per the rules. The committee members appealed to give permission for the decoration of mosques and processions in the district centers. The Chief Minister suggested to the committee members to prepare a list and submit . The CM directed Chief Secretary Santhi Kumari to look into the matter and make appropriate arrangements. Ministers Ponnam Prabhakar, Sridhar Babu, DGP Jitender and others participated in the meeting.

మిలాద్-ఉన్ న‌బి ప్ర‌ద‌ర్శ‌న‌లు సెప్టెంబ‌రు 19న‌

  • ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తికి మిలాద్ క‌మిటీ సానుకూల‌త

మిలాద్-ఉన్-న‌బి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19వ తేదీన నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ‌చ్చే నెల 16న మిలాద్ ఉన్ న‌బి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మిలాద్ క‌మిటీ నిర్ణ‌యించింది. మిలాద్ ఉన్ న‌బి ఏర్పాట్ల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సెప్టెంబ‌రు ఏడు నుంచి గ‌ణేష్ న‌వ‌రాత్రోత్స‌వాలు, 17న గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ఉన్న విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో మిలాద్ ఉన్ న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను వాయిదా వేసుకునే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి, మంత్రులు మిలాద్ క‌మిటీ స‌భ్యుల‌కు సూచించారు. ఈ అంశంపై చ‌ర్చించే బాధ్య‌త‌ను మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్ బాబు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడ‌ర్ అక్బ‌రుద్దీన్ ఒవైసీ, మిలాద్ క‌మిటీ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. స‌మీక్ష అనంత‌రం వారు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌ద‌ర్శ‌న వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు కోర‌గా మిలాద్ క‌మిటీ స‌భ్యులు సానుకూల‌త వ్యక్తం చేశారు.

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త 1499వ జ‌న్మ‌దినం వ‌చ్చే సెప్టెంబ‌ర్ 16న జ‌రుగుతుంద‌ని, వ‌చ్చే ఏడాది 1500వ జ‌న్మ‌దినం క‌నుక ఏడాది పాటు ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మిలాద్ ఉన్ న‌బి ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు కోరారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అనుమ‌తులు ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మ‌సీదుల అలంక‌ర‌ణ‌, వివిధ జిల్లా కేంద్రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యులు విజ్ఞ‌ప్తి చేశారు. ఒక జాబితా త‌యారు చేసి ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. వాటిని ప‌రిశీలించి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. స‌మావేశంలో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్‌బాబు, డీజీపీ జితేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.