CM held meeting with top officials to envisage plans for the development of Future City

Chief Minister Sri A. Revanth Reddy held a meeting with top officials to envisage plans for the development of Future City.

The officials briefed the Chief Minister about the proposed Road and Metro Rail connectivity from the International Airport, Shamshabad to the Future City.

Making several suggestions, the CM ordered the officials to prepare a road map to ensure connectivity from the Outer Ring Road ( ORR) to the Regional Ring Road ( RRR). The authorities have been asked to prepare plans to develop radial roads in the future city.

A proposal to develop Metro Rail connectivity from the New High Court to the Future City via Shamshabad Airport will be studied.

CM Revanth Reddy asked the officials to work in coordination on land acquisition and other issues related to the development of road and metro lines and also finalise plan of action and route map at the earliest. The CM wanted necessary steps should be taken to start work on a war footing.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్ మ్యాప్ ను సీఎం కు వివరించిన అధికారులు.

రూట్ మ్యాప్ పై పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి:

  • ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించిన సీఎం.
  • ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించిన సీఎం.
  • కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించిన సీఎం.
  • రోడ్, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పని చేయాలన్న సీఎం.
  • వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పిన సీఎం.
  • యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.