HYDRA to extend wide range of services to Hyderabad citizens soon

  • CM Sri Revanth Reddy asks officials to finalize modalities for HYDRA before Assembly session
  • Special funds for HYDRA
  • The HYDRA will protect government lands, ponds and nalas from encroachment in GHMC limits

Chief Minister Sri A. Revanth Reddy ordered the officials to constitute the HYDRA (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) aiming to extend a wide range of services to the citizens in accordance with the fast expansion of the Hyderabad city. The CM already decided to introduce HYDRA as per the National Disaster Management Act. The officials have been asked to conduct further study on the establishment of HYDRA and finalize the modalities to enforce the new system.

The CM suggested developing a coordination mechanism between GHMC, Water Board, Vigilance, Traffic, Energy wing and Police to enforce HYDRA more effectively. The existing Enforcement Vigilance and Disaster Management Department will be reorganized accordingly.

CM Revanth Reddy ordered the officials to prepare clear proposals about the requirement of staff at different levels and the deputation from other wings to work in HYDRA.

The CM suggested that HYDRA should be entrusted with the responsibility of the management of the area in the limits of 2,000 square km up to ORR (Outer Ring Road) and finalize its geographical limits on the lines of existing zones in the city for the convenience of the work. The draft proposal for HYDRA should be prepared before the start of the Assembly session and consider the allocation of special funds, if necessary for it.

CM Revanth Reddy held a review on the formation of HYDRA and the finalization of the modalities at the Secretariat on Friday. Chief Secretary Santhi Kumari, Municipal Administration Secretary Dana Kishore, GHMC Commissioner Amrapali, GHMC EVDM Commissioner Ranganath, CMO Principal Secretary Seshadri and CM Special Secretary Ajith Reddy participated in this meeting.

The Chief Minister said that, along with the management of disasters, HYDRA should be entrusted with the main responsibilities of protection of government properties, curb the encroachment of ponds and nalas, removal of encroachments, illegal constructions and structures, removal of illegal hoardings and advertisements, traffic management, drinking water and electricity supply.

The CM also alerted the officials of HMDA, Water Board, Disaster Management and Municipal Administration to maintain regular coordination among themselves. The responsibility of removal of unauthorized hoardings and flexies under the jurisdiction of GHMC and collection of penalties will be transferred to HYDRA in the new system. The officials are advised to conduct a study to bring stringent rules to curb the encroachment of Nalas, Ponds and government lands.

హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఇప్పుడున్న ఎన్​ ఫోర్స్​మెంట్​ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని ఆదేశించారు.

కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి.. ఎంత మంది సిబ్బంది ఉండాలి.. ఏయే విబాగాలపై వీరిని డిప్యుటేషన్పై తీసుకోవాలి.. అనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు.

అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని చెప్పారు.

హైడ్రా ఏర్పాటు, సంబంధిత విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని సీఎం చెప్పారు.

హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్​మెంట్​, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని అన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు.