The Indian Navy has chosen Telangana as a key base. The second VLF (very low frequency) communication transmission station in the country is being set up in Vikarabad district.
The Navy uses VLF (Very Low Frequency) communication transmission station to communicate with ships and submarines. This station will be set up in Damagudem forest area near Puduru of Vikarabad Mandal. This is the second station in the country. INS Kattabomman Radar Station at Tirunelveli, Tamil Nadu was the first of its kind. It has been serving the Navy since 1990. The Eastern Naval Command in Visakhapatnam has already identified Telangana as a suitable area for setting up a second radar station.
Since 2010, the Navy has been in touch with the state government. Despite all the environmental permits and clearances, the allotment of land did not proceed due to the negligence of the previous government. With the special initiative of Chief Minister A Revanth Reddy, all the obstacles to this project were removed. Commodore Karthik Shankar, Circle DEO Rohit Bhupathi and Captain Sandeep Das met Chief Minister A Revanth Reddy on Wednesday.
The officials of Vikarabad DFO and Naval Command Agency signed the agreement for the transfer of forest lands. 1174 hectares of forest land under Damagudem Reserve Forest has been handed over to the Navy. In 2014 itself, the Union Forest and Environment Department approved the Navy’s proposals. Campa funds of Rs 133.54 crores for handing over forest land and Navy has paid Rs 18.56 crores for the works undertaken for land conservation measures.
The Damagudem Forest Protection has filed a petition in court seeking to cancel this project. The court has issued orders to take all precautions in accordance with the conditions decided by the government. Along with the navy station, the township would have schools, hospitals, banks and markets. This naval unit consists of around 600 naval personnel and other civilians. About 2500 to 3000 people live in this township. Adequate measures would be taken to preserve biodiversity and ecological balance in the region through extensive planting. As a part of this project, about 27 km of road will be constructed around Damagudem Reserve Forest. This new VLF center will be completed in 2027.
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.
దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది.
2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమోడోర్ శ్రీ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో శ్రీ రోహిత్ భూపతి, కెప్టెన్ శ్రీ సందీప్ దాస్ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.
2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది.
ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తవనుంది.