CM Sri A. Revanth Reddy Pays Tribute to the statue of Mahatma Jyotiba Phule

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నెక్లెస్ రోడ్డు మార్గం, ఐమాక్స్ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి విగ్రహ ఏర్పాటుకు అవసమైన ప్రణాళికను అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారితో పాటు అధికారులు పాల్గొన్నారు.