Hyderabad |Aug 05, 2015 12:00 AM
ఈ నెల 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించి వచ్చే నాలుగేళ్ల కోసం ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పంచాయతిరాజ్ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, కమిషనర్ అనితారాంచంద్రన్, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులతో గ్రామ జ్యోతి కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు....
Hyderabad |Aug 05, 2015 12:00 AM
రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ విద్యా సంస్థలన్నీంటిని ఒకే గొడుగు కిందికి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి సగటున పది రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన చేయాలని చెప్పారు....
Hyderabad |Aug 04, 2015 12:00 AM
సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తేవాలని, ఈ ప్రక్రియలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, వ్యవసాయంతోనే గ్రామీణ జీవితం ముడిపడి వుందని, పట్టణాల అవసరాలు కూడా వ్యవసాయం ద్వారానే తీరాలని ముఖ్యమంత్రి అన్నారు....
Hyderabad |Aug 03, 2015 12:00 AM
పేదల గృహనిర్మాణ కార్యక్రమాన్ని తెలంగాణలో దశలవారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదారాబాద్ నగరంలో, ఇతర ప్రాంతాల్లో పేదల గృహసముదాయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అన్వేషించాలని చెప్పారు....
Hyderabad |Aug 03, 2015 12:00 AM
తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. రెండు నెలల క్రితం 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం పిలిచిన టెండర్లను సోమవారం తెరిచారు. తాజా పరిణామంతో దేశంలోనే ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నది. టెండర్లు తెరిచిన అనంతరం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జెన్కొ సిఎండి ప్రభాకర్ రావు, సిపిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సెక్రటేరియట్లో సమావేశవయ్యారు....
Hyderabad |Aug 03, 2015 12:00 AM
హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌కు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ తొలి మహిళా పైలట్‌కు అవసరమయ్యే శిక్షణా ఖర్చులు భరించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సయిదా ఫలక్ గత నెలలో జరిగిన చెన్నై ఒపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. గతంలో కూడా ఎన్నో అవార్డులు సాధించింది....
Hyderabad |Aug 02, 2015 12:00 AM
హైదరాబాదులోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు (డి.ఆర్.డి.ఓ) మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు హైదరాబాద్ డి.ఆర్.డి.ఓ పరిశోధనలు ఎంతగానో దోహదం చేశాయని సిఎం గుర్తు చేశారు....
Hyderabad |Jul 30, 2015 12:00 AM
పంచాయితీ రాజ్ ఉద్యమ స్ఫూర్తిని గ్రామ స్థాయిలో తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి, పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్యారా మార్పు సాధించాలన్నారు. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో గురువారం సమీక్ష నిర్వహించారు....
Hyderabad |Jul 28, 2015 12:00 AM
మెదక్ జిల్లా ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీకి 4.922 హెక్టార్ల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఈ యూనివర్సిటీ ఏర్పాటు పనులు త్వరగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటు గజ్వేల్ లో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎం కేసిఆర్ సమీక్ష నిర్వహించారు....
Hyderabad |Jul 29, 2015 12:00 AM
కన్న తండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకున్న ప్రత్యూష బుధవారం మద్యాహ్నం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చింది. ఇటీవల గ్లోబల్ ఆసుపత్రిలో ప్రత్యూషను పరామర్శించిన సందర్భంగా, కోలుకున్న తర్వాత తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు....
Hyderabad |Jul 27, 2015 12:00 AM
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం జాతికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రపతిగానే కాకుండా వివిధ రంగాల్లో అబ్దుల్ కలాం చేసిన సేవలు భారత దేశ ఔన్నత్యాన్ని పెంచాయని సిఎం అన్నారు...
Hyderabad |Jul 27, 2015 12:00 AM
హైదరాబాద్ నగరంలో ప్రజలకు కావలసిన సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటికే నిర్మించిన వాటి నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నగరంలో కామన్ సదుపాయాలు-పురోగతిపై సమీక్ష జరిపారు....
Hyderabad |Jul 27, 2015 12:00 AM
హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందివ్వడమే లక్ష్యంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించి మంచినీటిని అందించాలని, హైదరాబాద్ మంచినీటి కొరతలేని నగరంగా పిలువబడాలన్నారు....
Hyderabad |Jul 26, 2015 12:00 AM
గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నుంచి "గ్రామ జ్యోతి" అనే కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సిఎం వెల్లడించారు. జనాభాను బట్టి అన్ని గ్రామాలకు రెండు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు అందివ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు....
Hyderabad |Jul 27, 2015 12:00 AM
అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యావిషయిక స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ ముస్లింల కోసం అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యలయంలో సోమవారం సమీక్ష జరిపారు....
Hyderabad |Jul 26, 2015 12:00 AM
తెలంగాణలో గోదావరి మహాపుష్కరాలు విజయవంతంగా పూర్తి కావడంతో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.జరిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు....
Hyderabad |Jul 23, 2015 12:00 AM
శుక్ర, శనివారాలు గోదావరి పుష్కరాల చివరి రెండు రోజులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా అధికారులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం పుష్కరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్‌శర్మ, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి జిల్లాలలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని, చివరి రెండు రోజులు కూడా అదే స్పూర్తి కొనసాగించాలని కోరారు....
Hyderabad |Jul 22, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekar Rao handed over phase-II TS-iPASS letters of approval to 19 units on Wednesday in Secretariat. The new industrial entities will come up in Rangareddy, Mahaboobnagar, Medak and Warangal districts with a total investment of Rs. 1087.37 crore and will provide employment opportunities to 5,321 individuals. From manufacturing of helicopter cabin kits, cell phones to pharmaceutical formulations, steel and iron alloy castings, footwear accessories, the new units operate in wide ranging product developments. Among the companies that received the letters of approval today is Spanish’s Pharma giant Chemo....
Hyderabad |Jul 21, 2015 12:00 AM
సనత్ నగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఇందిరా నగర్ బస్తీని మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తూ ముఖ్యమంత్రి ఇందిరా నగర్ బస్తీ వద్ద ఆగారు. ఇరుకైన రహదారికి ఇరువైపులా వున్న ఇండ్లను పరిశీలించారు....
Hyderabad |Jul 21, 2015 12:00 AM
హైదరాబాద్ కు హరితహారం కార్యక్రమాన్ని ప్రణాళికాబద్దంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. నగరం చుట్టూ వున్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా అందమైన చెట్లు పెంచితె, హైదరాబాద్ నగరానికి హరితహారం అవుతుందని సిఎం చెప్పారు....
Hyderabad |Jul 21, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డు జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై సిఎం మంగళవారం సంతకం చేశారు....
Hyderabad |Jul 21, 2015 12:00 AM
ఇష్టారాజ్యంగా నడుస్తున్న యూనివర్సిటీల పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైన యూనివర్సిటీ చట్టాలను రూపొందించాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు....
Hyderabad |Jul 20, 2015 12:00 AM
రాష్ట్రంలో వారసత్వ కట్టడాలను గుర్తించి, రక్షించడానికి సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. వారసత్వ కట్టడాల గుర్తింపు అసమగ్రంగా వుందని, జిల్లాలలో కూడా అనేక వారసత్వ కట్టడాలున్నప్పటికీ జాబితాలో చోటు కల్పించలేదన్నారు. హైదరాబాద్ లో వున్న అసెంబ్లీ భవనం కూడా వారసత్వ కట్టడాల జాబితాలో లేదన్నారు. హైదరాబాద్ లో, జిల్లాల్లో వున్న వారసత్వ కట్టడాలను గుర్తించడానికి రాష్ట్ర స్థాయి కమిటీని నియమించారు....
Hyderabad |Jul 20, 2015 12:00 AM
ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయడం తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామన్నారు. ముందుగా హైదరాబాద్ నగరంలో, తర్వాత రాష్ట్రమంతా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమం 15-20 రోజుల్లోనే వంద శాతం పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ఆధార్ నంబరుతొ అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని కూడా స్పష్టం చేశారు....
Hyderabad |Jul 20, 2015 12:00 AM
నగరంలో జరుగుతున్న బోనాల పండుగకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, పద్మారావులతో మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన బోనాల పండుగ ఏర్పాట్లను సోమవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్షించారు. మంత్రులు నాయిని నర్సిహారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, జిహెచ్ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్, నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు....
Hyderabad |Jul 18, 2015 12:00 AM
సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. "జరిగిన దాన్ని పీడకలలా మర్చిపో. జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. నిలబడాలి.నిలదొక్కుకోవాలి. జీవితం ఇంకా చాలా ఉంది. కొత్త జీవితం ప్రారంభించాలి. బాగా చదివి పైకి రావాలి. రేపు నీలాగా ఇంకెవరికైనా కష్టం వస్తే ఆదుకోనే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. నీకు అండగా నేను ఉంటాను. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కూడా కట్టించి ఇస్తా. నాకెవరూ లేరని బాధ పడొద్దు. ఎవరో ఎదో చేస్తారని భయపడొద్దు. నీకు నేనున్నాను. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మా ఇంటికే రా. నిన్ను మంచి హాస్టల్ లో పెట్టి చదివిస్తా. సెలవులప్పుడు నా ఇంటికే వచ్చి ఉండు. కవిత (ఎంపి) కూడా నీకు తోడు ఉంటది. నీకు సిఎం కేసిఆర్ అండగా ఉన్నాడనే ధైర్యంతో ఉండు. నీకు పోలీసు కాపాలా కూడా పెట్టిస్తా. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కూడా నిన్ను చూసుకుంటడు." అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రత్యూషకు భరోసా ఇచ్చారు....
Hyderabad |Jul 15, 2015 12:00 AM
యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ది కోసం తయారు చేసిన ప్రణాళికలను త్వరితగతిన అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రధాన యాదాద్రితో పాటు మొత్తం నవగిరులను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై ఇప్పటికే తయారైన ప్రతిపాదనలతో పాటు, కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపి బూర నర్సయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్సి నర్సింగ్‌రావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజి.గోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, నల్గొండ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్కిటెక్ట్స్ జగన్, ఆనంద్‌సాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు....
Hyderabad |Jul 16, 2015 12:00 AM
సీనియర్ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు 200 చిత్రాల్లో 5 వేల పాటలకు పైగా ఆలపించిన రామకృష్ణ తన మధుర గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అన్నారు....
Hyderabad |Jul 16, 2015 12:00 AM
గోదావరి నదీ జలాలలో తెలంగాణ రాష్ట్రానికున్న వాటాకు అనుగుణంగా నీటిని సంపూర్ణంగా, సమర్దవంతంగా వాడుకునేందుకు అవసరమైన విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గోదావరి బేసిన్లో దాదాపు 54 నియోజకవర్గాలున్నాయని, నాలుగు అర్బన్ నియోజకవర్గాలు పోగా, మిగతా 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు...
Hyderabad |Jul 14, 2015 12:00 AM
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గోదావరి మహా పుష్కరాలపై ఉదయం నుండి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ, పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటూ సమీక్ష జరుపుతున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంగళవారం ఉదయం పుష్కరాలు ప్రారంభించిన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ శివశంకర్, రెవిన్యు కార్యదర్శి శ్రీ మీనా, డిఐజి శ్రీ మల్లారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఏఏ ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ...
Hyderabad |Jul 12, 2015 12:00 AM
వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాను ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ విభాగంలో తొలిసారి టైటిల్ గెలిచిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కైవసం చేసుకున్నారని ముఖ్యమంత్రి గుర్తుచేసారు....
Hyderabad |Jun 29, 2015 12:00 AM
మహిళల డబుల్స్ విభాగంలో కెనడా ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్న గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలను ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అభినందించారు....
Hyderabad |Jun 23, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలో అనాధ పిల్లల కోసం ఓ విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అనాధ పిల్లల చదువు, వసతి తదితర అంశాలను సచివాలయంలో ముఖ్యమంత్రి మంత్రులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె. తారక రామారావు, శ్రీ లక్ష్మా రెడ్డి, డిప్యుటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ, సి.ఎం.ఓ ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, జి.హెచ్.ఎం.సి కమీషనర్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో చర్చించారు. అనాధ పిల్లలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది తన ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. అనాధ పిల్లలపై ధృష్టి పడడానికి గల నేపధ్యాన్ని ముఖ్యమంత్రి వివరించారు....
Hyderabad |Jun 23, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekar Rao has requested the President of India to launch the prestigious initiative of 'Telanganaku Haritha Haram' from Yadagirigutta in Nalgonda district, the holy abode of Lakshmi Narasimha, on 3 July, 2015. In a letter addressed to Sri Pranab Mukherjee, the Hon'ble CM remarked that the Hon'ble President's presence at the programme would enthuse all sections of the society to actively participate in the green initiative....
Hyderabad |Jun 22, 2015 12:00 AM
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిశారు. వివిధ రాష్ట్రాల్లో వున్న గనుల ద్వారా అపారమైన ఖనిజ సంపదను వెలికితీసి, జాతి అభివృద్దికి ఉపయోగించే అంశంపై ఇద్దరూ చర్చించారు. తెలంగాణలో ఉన్న గనులు, ఖనిజాల లభ్యతపై మాట్లాడారు. అపారమైన బొగ్గు నిల్వలను వెలికితీసే విషయంపై సిఎం చెప్పారు. బయ్యారం గనులలో ఐరన్ ఓర్ నిల్వలపై తలపెట్టిన అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సిఎం కోరారు....
Hyderabad |Jun 21, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekar Rao has asked the officials to initiate the process of land acquisition/ purchase for Palamuru Lift Irrigation Scheme, Kaleshwaram (Pranahitha) project and expansion of Yadagirigutta-Warangal highway. Hon'ble CM was speaking at the conference with district Collectors, SPs and other senior officials held at MCRHRD on Sunday....
Hyderabad |Aug 31, 2015 12:00 AM
'స్వచ్ఛ హైదరాబాద్'పై ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో శనివారం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. డిల్లీ, నాగ్‌పూర్ నగరాల్లో పర్యటించి వచ్చిన అనుభవాలను ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యే లక్ష్మణ్ వివరించారు. ఈ రెండు నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ అవలంభించిన పద్దతులు చెప్పారు. భవన నిర్మాణాలు, కూల్చివేతల సందర్బంగా వచ్చే శిథిలాలను క్రమ పద్దతిలో సేకరించడంతో పాటు, వాటిని తిరిగి ఉపయోగించే పద్దతులు అవలంబించాలని సమావేశం నిర్ణయించింది....
Hyderabad |Jun 19, 2015 12:00 AM
సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన 16 గ్రామాల పరిధిలో గల 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. గజ్వేల్ నియెజకవర్గం కొండపాక మండలంలోని 11 గ్రామాలు, సిద్దిపేట మండలంలోని 5 గ్రామాలకు సాగునీరు లేక రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. దీనిపై రైతులు చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దేవాదుల తపాస్ పల్లి రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందస్తామని సిఎం కేసిఆర్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో రైతులకు చెప్పారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రైతులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు....
Hyderabad |Aug 31, 2015 12:00 AM
A meeting would be held at MCRHRD at 2 PM on Saturday - 20th June 2015, under the leadership of CM Sri K Chandrashekar Rao to deliberate on "Swachh Hyderabad". Decisions related to waste management would be taken after discussion with elected representatives of Hyderabad city. Other issues on agenda include water supply, power and roads....
Hyderabad |Jun 19, 2015 12:00 AM
పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ముస్లిములకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర దినాల్లో ముస్లిం సమాజమంతా సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని, అల్లా వారికి సుఖశాంతులు ప్రసాదించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సాటివారికి చేయూతనందించాలనే రంజాన్ సారాంశం మరింతగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు....
Hyderabad |Jun 17, 2015 12:00 AM
Telangana has won the 'REPA Award 2015' under 'Best State of India for Energy Security, Governance and Sustainability' category. The awards were constituted by the Renewable Energy Promotion Association (REPA) and its publication ENERTIA, one of Asia’s premier journals on sustainable energy and power. ...
Hyderabad |Jun 11, 2015 12:00 AM
A delegation from Foxconn Group led by Vincent W.H Tong and Calvin Chin called on CM Sri K Chandrashekar Rao today at Camp Office....
Hyderabad |Jun 05, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekar Rao distributed house site pattas to about ten poor families formally initiating the government's gargantuan target of 1.25 lakh from Malakajgiri on Friday. The government has decided to regularise the dwellings that are less than 125 sq. yds. in area meeting the criteria laid down in G.O No. 58....
undefined |Jun 04, 2015 12:00 AM
Union Minister of State for Power, Coal and New & Renewable Energy (Independent Charge) Sri Piyush Goyal met Hon'ble Chief Minister Sri K.Chandrashekar Rao at camp office on Thursday....
undefined |Jun 03, 2015 12:00 AM
Chief Minister Sri K.Chandrashekar Rao has taken some time out of his busy schedule to be with his camp office staff and officials after returning from the official formation day ceremony at the parade grounds....
Hyderabad |Jun 02, 2015 12:00 AM
Representatives of global mobile manufacturing companies have met Chief Minister Sri K.Chandrashekar Rao and expressed interest for establishing their units in Telangana....
Hyderabad |May 25, 2015 12:00 AM
National Thermal Power Corporation (NTPC) Chairman and Managing Director Sri Arup Roy Choudhury along with Southern Regional Executive Director Sri R. Venkateshwaran met the Honourable Chief Minister Sri K. Chandhrashekar Rao at camp office on Monday...
Hyderabad |May 25, 2015 12:00 AM
Chief Minister Sri K Chandrashekar Rao has decided to announce the new industrial policy of the State on June 7. He said TS-iPASS (Telangana State Industrial Project Approval and Self-certification System) would be unveiled in the presence of who’s who from the Industrial sector...
Hyderabad |May 24, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekar Rao told a team of Hitachi delegation that any investor will be very happy to start an industry in and around Hyderabad. The CM also mentioned that the Telangana State Government unveiled the new industrial policy framework by bringing legislation and would be formally launching it soon...
Hyderabd |May 20, 2015 12:00 AM
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాచారం శివారు సింగం చెరువు తాండాలో పర్యటించారు. దాదాపు 100 ఇండ్ల తాండాలో ఇరుకు గదుల్లో నివసిస్తున్న గిరిజనుల దీనస్థితిని స్వయంగా పరిశీలించారు. జి ప్లస్ 2 విధానంలో గిరిజనులందరికి రెండు బెడ్ రూముల ఇండ్లు కట్టిస్తామని హామి ఇచ్చారు....
Hyderabad |May 17, 2015 12:00 AM
స్వచ్ఛ హైదరాబాద్ కార్యాక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్శిగుట్ట, లాలానగర్, శాంతినగర్, చిలకలగూడ తదితర బస్తీల్లో తిరుగుతున్నారు. బస్తీ వాసులతో నేరుగా మాట్లాడుతున్నారు. అంబర్ నగర్ లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. బస్తీ వాసులతో పాటు నేలపైనే కూర్చోని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు....
Hyderabad |May 18, 2015 12:00 AM
స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమం నాలుగు రోజులతో ముగిసేది కాదని, వచ్చే నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ కార్యక్రమం మంచి ప్రారంభంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. కోతలు లేని విద్యుత్ సరఫరా చేయడం లాంటి కొన్ని పనులు సాధ్యమవడం వల్లనే హైదరాబాద్‌కు ఎంతో పేరొచ్చిందని, 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేస్తే అధ్బుత ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు....
Hyderabad |May 18, 2015 12:00 AM
నగరంలోని హమాలి బస్తినీ అమీర్ బస్తిగా మారుస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు . ఇరుకు గదుల్లో దుర్భర జీవితం అనుభవిస్తున్న దాదాపు 250 కుటుంబాలకు 6 అంతస్తుల టవర్ నిర్మించి డబల్ బెడ్ రూం సౌకర్యంతో ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఆరు నెలల కాలంలోనే రూ.21 కోట్లతో కమ్యూనిటీ హాల్, పార్కింగ్ ప్లేస్, లిఫ్ట్‌లు లు ఉండే విధంగా ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఈ కాంప్లెక్స్ కు కింది భాగంలో 10 షాపుల నిర్మాణం కూడా చేసి దాని ద్వారా వచ్చే డబ్బులను కూడా పేదలు తమ ఇండ్ల నిర్వహణ కు ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తామన్నారు....
Hyderabad |May 17, 2015 12:00 AM
Chief Minister Sri K Chandrashekar Rao visited a 'basti' of Padmarao Nagar in Secunderabad as part of 'Swachh Hyderabad' campaign that was launched on Saturday. Hon'ble CM later interacted with the dwellers on the civic issues that concern them....
Hyderabad |May 12, 2015 12:00 AM
ఇరుకు గదులు, చిన్న సందులు, రోడ్ల పై పొర్లే మురికి కాలువలు, పేరుకు పోయిన చెత్తా చెదారం, మౌలిక సదుపాయాల లేమి, ప్రాధమిక ఆరోగ్యానికి కూడా నోచుకోకపోవడం లాంటి సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిచడం కోసమే స్వచ్చ హైదరాబాద్ కార్యాక్రమాన్ని చేపట్టిన్లటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు....
Hyderabad |May 12, 2015 12:00 AM
హైదరాబాద్ నగరంలో స్కైవేలు, మేజర్ కర్రిడార్ల్లు, మేజర్ రోడ్లు, గ్రేడ్ సపరేటర్లు, ఇతర రహదారుల నిర్మాణానికి సంబంధించి వెంటనే తొలి విడత టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జీహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో నగరానికి చెందిన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు, మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజివ్ శర్మ, జీహెచ్ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్ తదితరులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఎక్కడెక్కడ కారిడార్లు నిర్మించాలి? ఎక్కడ సపరేటర్లు నిర్మించాలి? ఏ పనులను ముందు చేపట్టాలి? అనే విషయంపై చర్చ జరిగింది. గూగుల్ మ్యాప్ సహాయంతో ఆయా ప్రాంతాలను గుర్తించారు....
Hyderabad |May 12, 2015 12:00 AM
స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 14న సచివాలయంలో హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సమత బ్లాకులో సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే అంశాలపై సమావేశంలో చర్చిస్తారు....
Hyderabad |May 12, 2015 12:00 AM
ఆర్.టి.సి సమ్మె నెపథ్యంలో ఈ నెల 14న జరగనున్నఎంసెట్ పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం అన్ని జిల్లాల కల్లెక్టర్లతో మాట్లాడారు. ఎంసెట్ రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రలా వద్దకు తీసుకువెళ్లడానికి వాహనాలు సమకూర్చే భాద్యతను అధికారులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది....
Hyderabad |May 13, 2015 12:00 AM
హైదరాబాద్ నగర ప్రజలకే కాకుండా హైదరాబాద్‌కు వచ్చి పోయే ప్రయాణికులకు, రైళ్లు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి కూడా ఉపయోగపడేలా మెట్రో రైలు మార్గం ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నిర్ణీత సమయంలోనే అన్ని పనులు పూర్తి అవుతున్నందుకు, మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు-రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నందుకు ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు....
Hyderabad |May 12, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekhar Rao has reviewed the ‘Telanganaku Haritha Haaram’ programme at MCHRD. Excerpts from the Chief Minister’s speech: -- Worldwide, efforts are on to cut down the Greenhouse gas emissions and thereby bring down the rising temperatures. One shouldn’t view such initiatives as duty of just the government but should be carried out with active participation from the general public....
Hyderabad |May 11, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekhar Rao has asked the Cabinet sub-committee, formed to resolve the RTC strike issue, to take measures for safeguarding the public transport system and simultaneously making it self-reliant. He advised the sub-committee to take into account workers’ welfare, financial status of the Road Transport Corporation and limitations of the government while taking a decision....
Hyderabad |May 10, 2015 12:00 AM
Chief Minister Sri K. Chandrashekhar Rao has constituted a cabinet sub-committee to advise the government on the ongoing RTC strike after holding discussions with all the stakeholders. The committee would be led by Labour Minister Sri Nayini Narasimha Reddy while Finance Minister Sri Etala Rajendar and Transport Minister Sri P. Mahendar Reddy would its members. Chief Minster has asked the committee to hold discussions with the workers, officials and management of Road Transport Corporation and come up with recommendations. Chief Minister has also reviewed the transport services in the light of the strike by the RTC workers....
Hyderabad |Apr 30, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు కలిసి అక్రిడిటేషన్ రిపొర్టును సమర్పించారు. ఈ సందర్బంగా హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు త్వరలో మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ప్రభుత్వం తమ పాలసిని ప్రకటిస్తుందిని చెప్పారు....
Hyderabad |Apr 29, 2015 12:00 AM
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మే నెలలో తొలి అడుగులు వేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని న్యూస్ ఛానళ్లు, పత్రికా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. మే 6 తరువాత సమావేశం నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్దికి, స్వచ్చ హైదరాబాద్ నిర్వహణకు కావలసిన సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నేరుగా మీడియా సంస్థల బాధ్యులతో చర్చిస్తారు....
Hyderabad |Apr 29, 2015 12:00 AM
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూపకల్పన చేశారు. రూ. 1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ను క్లీన్సిటిగా మార్చనున్నారు. స్వచ్చ తెలంగాణ - స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజలందరి విస్త్రుత భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించారు....
Hyderabad |Apr 29, 2015 12:00 AM
హైదరాబాద్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రెండు లక్షల మంది నిరుపేదలకు ఇండ్లు లేవని తేలిందని, వారందరికి ప్రభుత్వం తరపునే ఇండ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా లేని నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సిఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో పేదల గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి దాదాపు నాలుగు గంటల పాటు క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవిన్యు శాఖ కార్యదర్శి మీనా, జిహెచ్ఎంసి కమీషనర్ సోమేష్‌కుమార్, సిఎంఒ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, హైదరాబాద్ సిటి చీఫ్ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహెందర్‌రెడ్డి, సివి.ఆనంద్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు....
Hyderabad |Apr 28, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి తీర్మానం చేసిన మోతె గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును గ్రామస్తులు ఆహ్వానించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మోతె గ్రామానికి చెందిన ఎంపిపి బాలరాజు, గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచ్ రాజేశ్వర్, గ్రామానికి చెందిన పెద్దలు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు....
Hyderabad |Aug 31, 2015 12:00 AM
నేపాల్ దుర్ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అక్కడెవరైనా భారతీయులు, తెలంగాణ పౌరులు ఇబ్బంది పడుతున్నారా అనే విషయంపై ఆరా తీయాల్సిందిగా సిఎంఒ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, రెవిన్యు శాఖ కార్యదర్శి మీనా తదితరులు ఎప్పటికప్పుడు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్‌లో జరిగిన భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రికులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అనే అంశాన్ని సిఎంఒ అధికారులు ఆరా తీస్తున్నారు....
Hyderabad |Apr 25, 2015 12:00 AM
నేపాల్ లో సంభవించిన భూకంపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులను సురక్షితంగా తిరిగి రప్పించడానికి, ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, విదేశాంగ శాఖ సమన్వయంతో ఈ పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సి.ఎం.ఓ అధికారులు ఎప్పతికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు....
Hyderabad |Apr 23, 2015 12:00 AM
వరంగల్ జిల్లాలోని కమలాపూర్లొ మూతపడిన బల్లాపూర్ ఇండస్ట్రీ లిమిటెడ్ (కమలాపూర్ రెయాన్స్ ఫ్యాక్టరీగా ప్రసిద్ది)ను మళ్లీ తెరిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి కార్మికులను కాపాడుకుంటామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలని, ఇక్కడి యువకులకు ఉపాధి దొరకాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పాత పరిశ్రమలు మూత పడకుండా కూడా చూసుకుంటామని చెప్పారు....
Hyderabad |Apr 22, 2015 12:00 AM
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో హోల్‌సేల్, రిటేల్ వ్యాపారం చేసే సంస్థలు స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచే విషయంలో మరింత చొరవ ప్రదర్శించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సచివాలయంలో బుధవారం వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ సిఇఒ డేవిడ్ చీస్ రైట్, ఇండియా శాఖ సిఇఒ క్రిష్ అయ్యర్, వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు....
Hyderabad |Apr 22, 2015 12:00 AM
Chief Minister Sri K.Chandrashekar Rao at Mahatma Basaveshwara Jayanthi Celebrations held at Ravindra Bharathi. Union Minister Sri Bandaru Dattatreya, Dy CM Sri Mahamood Ali, Home Minister Sri Nayini Narasimha Reddy, Irrigation Minister Sri Harish Rao, MP Sri BB Patil, MLCs Sri Karne Prabhakar, and Sri Ramulu Naik were among those who were present at the occasion....
Hyderabad |Apr 21, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న మంచినీటి సరఫరా పథకాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది. కేంద్రం కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు వాటర్ గ్రిడ్ కార్యక్రమ వివరాలను ఇతర రాష్ట్రాలకు పంపింది. ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ మంచినీటి కార్యక్రమం వార్షిక ప్రణాళిక సమావేశంలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ స్కీం పై చర్చ జరిగింది....
Hyderabad |Apr 21, 2015 12:00 AM
హైదరాబాద్ మెట్రొపాలిటన్ డెవలప్మెంట్ అథారిటిని మరింత బాధ్యతాయుతమైన సంస్థగా, జవాబుదారి యంత్రాంగంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో మంగళవారం ఆయన హెచ్ఎండిఎ పై సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఎ కమిషనర్ ప్రదీప్‌చంద్ర, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్‌కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి ఎంజీ.గోపాల్, సిఎంఒ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు....
Hyderabad |Apr 17, 2015 12:00 AM
...
Hyderabad |Apr 19, 2015 12:00 AM
As a tribute to the glorious history of the state of Telangana, a classical design of the proposed building to house the Telangana Kalabharathi prepared by world famous architect Hafeez Contractor which was presented to Honorable Chief Minister has been approved....
Hyderabad |Apr 18, 2015 12:00 AM
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు రెండవరోజు మొదటి సెషన్ లో సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు, చేసిన సూచనలు, తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి....
Hyderabad |Apr 17, 2015 12:00 AM
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అధికారులు కూడా ఇదే స్పూర్తితో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని శ్రీ కె.చంద్రశేఖర్ రావు కోరారు. ప్రభుత్వ పథకాలు అట్టడుగు స్థాయి వరకు చేరాలని, పూర్తి పారదర్శకతతో, వేగవంతంగా పనులు జరగాలని చెప్పారు. సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. గతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 8,700 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 27,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నదని చెప్పారు. వీటి ఫలితాలు నూటికి నూరు శాతం అర్హులందరికి అందాలన్నారు....
Hyderabad |Apr 16, 2015 12:00 AM
మెదక్ జిల్లా సదాశివపేట మండలం అంకంపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీని విస్తరించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఫ్యాక్టరీ విస్తరణ విషయంలో ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు హామి ఇచ్చారు....
undefined |Apr 14, 2015 12:00 AM
భారతదేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మేధావి డా.బి.ఆర్. అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. సమాజంలోని అంతరాలను తొలగించడానికి, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి అవసరమైన మార్గాన్ని అంబేడ్కర్ నిర్దేశించారన్నారు....
Hyderabad |Apr 13, 2015 12:00 AM
CM reviewed the loss of lives, crops and property due to the untimely rains in Telangana. He instructed the officials to immediately assess the damage to crops and property and ensure speedy disbursal of compensation. Rs 5 Lakhs exgratia has been announced to those who lost their lives due to the rains...
Hyderabad |Apr 13, 2015 12:00 AM
Chief Minister Sri. K. Chandrashekar Rao congratulated Sania Mirza on becoming First Indian Woman to reach the World No.1 position in the doubles ranking. The Chief Minister has said that Sania's achievement will be inspirational to the youngsters of our country....
Hyderabad |Apr 09, 2015 12:00 AM
CPI (M) సీనియర్ నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ నర్రా రాఘవ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో సామాజిక, విప్లవ ఉద్యమాల్లో నర్రా రాఘవ రెడ్డి కీలకపాత్ర పోషించారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు....
Hyderabad |Apr 09, 2015 12:00 AM
Chief Minister Sri K.Chandrashekar Rao emphasized before the member NITI Ayog that Telangana State has been declared as a revenue surplus state by the Finance commission. The Chief Minister also told the Member that the FRBM guidelines for raising resources through borrowings for revenue surplus state should be at par with Government of India. He said that this will enable the states to invest in capital infrastructure to improve the economic growth. This point has been made by the Honourable Chief Minister particularly in the light of reduction in the centrally sponsored scheme outlay for the states and lesser share in the devolution of funds to revenue surplus states....
Hyderabad |Apr 07, 2015 12:00 AM
Representatives of Telangana Industrialists Welfare Federation headed by Sri. K. Sudhir Reddy, President, called on the Chief Minister Sri. K. Chandrashekar Rao at Secretariat and thanked the Chief Minister for uninterrupted power supply to the industries....
Hyderabad |Apr 06, 2015 12:00 AM
Chief Minister Sri. K. Chandrashekar Rao enquiring the health condition of injured SI Sri. Siddaiah, with the doctors and family members at Kamineni Hospitals....
undefined |Apr 06, 2015 12:00 AM
మియామి ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ టైటిల్ గెల్చుకున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మార్టినా హింగిస్ తో కలిసి డబుల్స్ టైటిల్ గెలుచుకున్న సానియా మీర్జాకు సిఎం శుభాకాంక్షల సందేశం పంపారు....
undefined |Apr 06, 2015 12:00 AM
Chief Minister Sri. K. Chandrashekar Rao has appointed Sri. Jogu Ramanna, Minister for Forest & BC Welfare as Chairman of the Jyothirao Phule Birthday Celebrations Committee. The Birthday will be observed on 11th April 2015....
undefined |Apr 05, 2015 12:00 AM
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా బాబు జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. మాజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ జగ్జీవన్ రామ్ 108 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ఆ మహానాయకుడిని స్మరిస్తూ సందేశం పంపారు. బీహార్ రాష్ట్రంలో పార్లమెంటరీ సెక్రటరీ స్థాయి నుంచి మొదలుకుని దేశ ఉప ప్రధాని వరకు అనేక పదవులు నిర్వహించిన శ్రీ జగ్జీవన్ రామ్ ప్రతీ సందర్భంలోనూ తన ముద్ర వేశారని ముఖ్యమంత్రి అన్నారు....
undefined |Apr 04, 2015 12:00 AM
సంఘ విద్రోహ శక్తులను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సూర్యాపేట కాల్పుల ఘటన, అనంతరం జరిగిన సంఘటనల్లో పోలీసులు స్పూర్తిదాయకమైన పాత్ర పోషించారని సిఎం అభినందించారు. సంఘవిద్రోహ శక్తులను అరెస్టు చేసే లక్ష్యంతో పోలీసులు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారన్నారు. సూర్యాపేట వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్, మోత్కూరు మండలంలో ఎదురుకాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ నాగరాజులది గొప్ప త్యాగంగా ముఖ్యమంత్రి చెప్పారు....
Hyderabad |Apr 03, 2015 12:00 AM
ఈ నెల 6 నుండి 24వ తేదీ వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగే అంతర్జాతీయ లీడర్షిప్ సెమినార్ లో పాల్గొనేందుకు ఖానాపురం ఎమ్మెల్యే శ్రీమతి రేఖా నాయక్ ఎంపికయ్యారు. అమెరికా ప్రయాణమయ్యే ముందు క్యాంపు కార్యాలయంలో శ్రీమతి రేఖానాయక్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను అభినందించారు....
hyderabad |Mar 31, 2015 12:00 AM
...
Hyderabad |Mar 28, 2015 12:00 AM
Chief Minister Sri. K. Chandrashekar Rao congratulated ISRO Chairman Sri. A.S. Kiran Kumar and his team for successful launch of IRNSS-1D, the fourth in the series of seven navigational satellites on board PSLV-C27, from Sriharikota. The Chief Minister said that this is another triumph of brilliance and hardwork of our scientists....
Hyderabad |Mar 24, 2015 12:00 AM
Chief Minister Sri. K. Chandrashekar Rao handed over letter sanctioning Rs. 35.5 Lakhs to Smt. Syeda Salva Fatima, towards financial support to undergo Multiengine Rating and Type Rating Training Course for pilots, in the Camp office this afternoon. Smt. Fatima, a graduate from Dr. B. R. Ambedkar Open University is the first Muslim girl from old City to pursue the course. This financial assistance would help Smt. Fatima to become a full fledged commercial pilot after completion of training. Smt. Fatima thanked the Chief Minister for the help....
undefined |Mar 23, 2015 12:00 AM
రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్టు అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని, ప్రతి ఇంచు అటవీ భూమిని సమర్దవంతంగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, అటవీ శాఖ ఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు....
undefined |Mar 21, 2015 12:00 AM
Telangana GENCO and REC have signed an MoU in the presence of CM Rural Electrification Corporation (REC) Limited, a Government of India Enterprise has come forward to fund to a tune of Rs. 24,000 Crores to Telangana State GENCO power projects of 6280 MW installed capacity. They are 800 MW at KTPS, 1080 MW at Bhadradri in Manugur of Khammam District and 4400 MW at Damaracherla in Nalgonda District totaling 6280 MW. A Memorandum of Understanding has been signed between REC represented by its Chairman & Managing Director Sri. Rajeev Sharma and TSGENCO represented by its Chairman & Managing Director Sri. D. Prabhakar Rao in the presence of Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao in the Camp Office of CM today afternoon coinciding the Telugu New Year’s day Ugadi. REC is a Navaratna Enterprise and provides financial assistance for rural electrification as well as all types of power generation, transmission and distribution projects. With this the taking off of 6280 MW of power production as mandated by Honorable CM, the financial closure has been achieved....
Hyderabad |Mar 20, 2015 12:00 AM
The office of the Accountant General (A & E) has taken up revision of pension of retired employees who retired from the service of the Government of Andhra Pradesh (AP) prior to 25.05.1998. This is being done in pursuance of GO No 223 Finance (HRM VI) Department dated 15.12.2014 issued by Government AP to implement the orders of the Hon'ble Supreme Court of India in Civil Appeal No 367-5368 of 2005....
Hyderabad |Mar 18, 2015 12:00 AM
National Bank for Agriculture and Rural Development (NABARD) has come forward to extend financial assistance to Telangana State in the areas of agriculture, agro related activities, green house cultivation, connectivity of rural bridges, social infrastructure like primary schools, drinking water and sanitation, renewable energy, cooperative banks, micro irrigation, farm mechanization, soil testing and mapping besides Mission Kakatiya and Drinking Water Supply Projects. Chairman NABARD Sri. Harsh Kumar Bhanwala along with Deputy Managing Director Sri. R. Amalor Parvanathan and Sri. Jiji Mammem called on the Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao this evening at Camp Office and informed about NABARD funding and financing. The Chairman NABARD told CM that NABARD has been financing all kinds of agriculture related activities in several states. He said the bank is also covering lot of social infrastructure....
Hyderabad |Mar 17, 2015 12:00 AM
CNN IBN "Indian of the year 2014" Popular Choice Award was awarded to Honourable Chief Minister Sri. K. Chandrashekar Rao. The award was received by MP Sri K. Keshava Rao on behalf of the Chief Minister at New Delhi....
Hyderabad |Mar 15, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రూ. 15 వేల కోట్ల రుణం అందించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్.సి) ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పి.ఎఫ్.సి సిఎండి ఎం.కె. గోయల్, తెలంగాణ GENCO సిఎండి డి. ప్రభాకర్ రావులు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎం.ఓ.యు పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఎఫ్.సి డైరెక్టర్ అగర్వాల్, జిఎం టి.కె. సింగ్, తెలంగాణ GENCO డైరెక్టర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులో ఏర్పాటు చేస్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంటుకు, నల్లగొండ జిల్లా దామరచర్లలో నెలకొల్పే 4400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు ఈ రుణం ద్వారా లభించిన నిధులను ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు రుణంపై వడ్డీని 12 నుండి 11.5 శాతానికి తగ్గిస్తున్నట్టు పి.ఎఫ్.సి ప్రకటించింది. దీనివల్ల తెలంగాణ GENCO కు రూ. 300 కోట్లకు పైగా మేలు జరుగుతుంది....
Hyderabad |Mar 12, 2015 12:00 AM
Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao in a letter requested Honorable Prime Minister Sri. Narendra Modi to reconsider the Government of India decision that the State Governments should not impose any levy on rice from the millers with effect from 1st October, 2015. The Chief Minister also suggested to continue to at least have the existing 25% levy with a view to safeguard the interests of the farmers to get remunerative prices for certain special varieties and at certain periods when the millers have good market outside the State or Country as the case may be....
Hyderabad |Mar 11, 2015 12:00 AM
Mapping Industrial growth by tapping sectors of advantage in Telangana CM Sri K. Chandrashekar Rao’s speech – Important points - Telangana has been a cosmopolitan area for more than 200 years and particularly the Hyderabad city. - There were 125 Industries in earlier days itself in Hyderabad. Asia’s biggest sugar industry was in Hyderabad. Telangana State has excellent land bank nearly 20 Lakh of acres. Right now about one and half lakh acres of land is ready for allotment....
Hyderabad |Mar 09, 2015 12:00 AM
Sri. Anurag Sharma, DGP, presenting a cheque of Rs. 2 crores 25 lakhs, on behalf of Police Association of Telangana State, to Chief Minister Sri. K. Chandrashekar Rao, towards CM's Relief Fund....
Hyderabad |Mar 02, 2015 12:00 AM
అవినీతికి వ్యతిరేకంగా నగర పోలీసులు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాడు ఓ కానిస్టేబుల్. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ స్వచ్చందంగా కొంత డబ్బును ప్రతిఫలంగా ఇవ్వజూపిన దరఖాస్తుదారుడితో సున్నితంగా తిరస్కరించి పోలీసులందరికి ఆదర్శంగా నిలిచాడు. ఆ కానిస్టేబుల్ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అతన్ని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని అభినందించడంతో పాటు పోలీసులు, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడావంటూ ప్రశంసల జల్లులో ముంచెత్తారు. వెస్ట్ జోన్ స్పెషల్ బ్రాంచికి జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ జి.నారాయణరావు తన విధి నిర్వహణలో భాగంగా పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం జూబ్లిహిల్స్ రోడ్ నెం. 10 సి లోని ఓ దరఖాస్తుదారుడి ఇంటికి శనివారం ఉదయం వెళ్లాడు. దరఖాస్తుదారుడి వివరాలను సేకరించిన అనంతరం ఇంటి పక్కన ఉండే వారిని సైతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి వెళ్తున్న నారాయణరావును దరఖాస్తుదారు తండ్రి ఆపి కొంత మొత్తాన్ని టిప్‌గా ఇవ్వడానికి ప్రయత్నించారు....
Hyderabad |Mar 02, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల జీవన ప్రమాణాలు పెంచుతామని, గ్రామస్థాయిలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యం కల్పిస్తామని, సమాజంలో అంగన్వాడి అక్కా చెల్లెల గౌరవం పెంచే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. శిశువు గర్బంలో ఉన్నప్పటి నుండి వారికి ప్రాథమిక స్థాయిలో విద్యా బుద్దులు నేర్పే వరకు అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలే సంరక్షకులుగా ఉంటున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉత్తమ బాధ్యతలను నిర్వహిస్తున్న అంగన్వాడి సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సచివాలయంలోని డి బ్లాక్ కాన్ఫరెన్సు హాలులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడారు. దాదాపు మూడు గంటలకు పైగా వారితో వివిధ అంశాలపై చర్చించారు. వారి అభిప్రాయాలు, సమస్యలు ఓపికగా విన్నారు. కొన్ని అంశాల్లో వారి నుంచి సూచనలు, సలహాలు కూడా తీసుకున్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ, జీత భత్యాలు, ఆరోగ్య లక్ష్మి అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్బంగా తన అభిప్రాయాలు చెప్పారు....
Hyderabad |Feb 28, 2015 12:00 AM
కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వికలాంగ కవయిత్రి బి.రాజేశ్వరీకి నెలకు 10,000/- రూపాయల చొప్పున పెన్షన్ అందే విధంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాజేశ్వరీకి సుద్దాల హనుమంతు పురస్కారం అందజేసిన సందర్బంగా చేనేత కార్మిక కుటుంబానికి చెందిన రాజేశ్వరీని ఆదుకుంటామని ప్రభుత్వం తరపున హామి లభించింది. రాజేశ్వరీ 1999 నుండి దాదాపు 350 కవితలను కాళ్లనే చేతులుగా మలుచుకుని రాశారు. సిరిసిల్ల రాజేశ్వరీ కవితలు పేరుతో ఓ పుస్తకం కూడా వెలువడింది. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా సాహితీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళగా రాజేశ్వరీని గుర్తించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ. 10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీ సొమ్మును ఆమె జీవనం కోసం వెచ్చించాలని అధికారులను ఆదేశించారు....
Hyderabad |Feb 27, 2015 12:00 AM
Yadagirigutta Development Authority is constituted under the Chairmanship of Honourable Chief Minister Sri. K.Chandrashekar Rao. Sri. G. Kishan Rao will be the Vice-Chairman and Managing Director,MP of Bhuvanagiri, MLAs of Aleru and Bhuvanagiri constituencies, Principal Secretaries of Municipal Administration, Finance and Endowments Departments, District Collector, Superintendent of Police, District Forest Officer of Nalgonda are the members. In addition to this,government will nominate 6 more members to the Yadagirigutta Development Authority....
Hyderabad |Feb 26, 2015 12:00 AM
The Honourable Chief Minister Sri. K. Chandasekhar Rao thanked the Union Minister of Railways Sri. Suresh Prabhu for agreeing to his request not to levy “Traffic block” charges for permitting crossing over the rail lines at eight designated sites across the three metro rail corridors in twin cities. It may be recalled that in a recent meeting the Honourable Chief Minister raised this issue with the Union Minister of Railways and he immediately responded by resolving the issue....
Hyderabad |Feb 23, 2015 12:00 AM
తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ 100 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయవాదుల సంక్షేమం కోసం ఈ నిధులు ఉపయోగించుకోవాలని చెప్పారు. తెలంగాణ న్యాయవాదుల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డబ్బులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సిఎం చెప్పారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించి న్యాయవాద సంఘాల నాయకులతో మాట్లాడి మార్గదర్శకాలు తయారు చేయాలని న్యాయ కార్యదర్శి సంతోష్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు....
Hyderabad |Feb 23, 2015 12:00 AM
జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 10 కోట్లను విడుదల చేస్తూ తయారైన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సోమవారం సంతకం చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులపై కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో శనివారం నాడు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు....
Hyderabad |Feb 21, 2015 12:00 AM
తెలంగాణలో బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందించే భృతి కార్యక్రమాన్ని మార్చి 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆ రోజు స్వయంగా తానే కరీంనగర్ జిల్లా మెట్ పల్లి, మెదక్ జిల్లా దుబ్బాక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ప్రతీ మండలంలో బీడీ కార్మికులకు భృతి ఇచ్చే కార్యక్రమాన్ని ఆయా మండలాల ఎంపిడివోలు పర్యవేక్షించాలన్నారు. బీడీ కార్మికులున్న జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. బీడీ కార్మికుల భృతి కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.40 కోట్ల రూపాయలు విడుదల చేసింది....
Hyderabad |Feb 21, 2015 12:00 AM
CM reviewing on Budget sessions - 2015 at Assembly Chairman of Legislative Council Sri. Swamy Goud, Speaker of Legislative Assembly Sri. S.Madhusudhana Chary, Minister for Legislative affairs Sri T. Harish Rao, Secretary Sri. Dr.S.Rajasadram are also seen in the picture....
Hyderabad |Feb 21, 2015 12:00 AM
National Bank for Agriculture and Rural Development (NABARD) has agreed to extend financial support to both Mission Kakatiya and Telangana Drinking Water Project. The Chief General Manager of NABARD, Hyderabad Unit Sri. Jiji Mammen called on the Honourable Chief Minister and said, that, this year they are funding Rs. 360 Crores for Mission Kakatiya and would extend to Rs. 500 Crores during the next financial year. He told the Honourable Chief Minister that the Drinking Water Supply Project would be funded from NABARD Infrastructure development fund as part of RIDF (Rural Infrastructure Development Fund) loan. He also assured the Honourable Chief Minister that with government guarantee, NABARD also bring down the rate of interest....
Hyderabad |Feb 21, 2015 12:00 AM
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించాలని, ప్రతిపాదనలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలిపెట్టాలని, ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి ఎవరూ అర్హులు లేకున్నా, ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాపారం చేసుకుంటే అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయ చేసుకుంటామంటే వారికి భూమిని సమకూర్చాలని చెప్పారు. ఇంకా సదరు కుటుంబ సభ్యులు తమ కుటుంబం నిలబడడానికి ఏమి కోరుకుంటారో దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు....
Hyderabad |Feb 21, 2015 12:00 AM
వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వరకే పరిమితం కాకుండా వాటి నిలువ కోసం కూడా మార్కెటింగ్ శాఖ ప్రణాళికాబద్దంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రైతులకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు కూడా సకాలంలో అందించేందుకు ముందుగానే నిలువ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సచివాలయంలో మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి పూనం మాల కొండయ్య అధికారులు ప్రియదర్శిని లక్ష్మీబాయి తదితరులతో మార్కెట్ శాఖను సమీక్షించారు....
Hyderabad |Feb 19, 2015 12:00 AM
Dr. Najma Heptulla, Honourable Union Minister of Minority affairs reassured her ministry's full support in carrying forward the programmes launched in Telangana State for the welfare of all the Minority communities. In a letter addressed to Honourable Chief Minister of Telangana Sri. K. Chandrashekar Rao, the Union Minister mentioned that she has already directed the officials of her ministry to expeditiously deal with the proposals coming from the Government of Telangana to the Ministry of Minority affairs....
Hyderabad |Feb 19, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నదని కంపెనీ ప్రతినిధులు అన్నారు. జిందాల్ సా లిమిటెడ్ సిఇఓ కమ్ డైరెక్టర్ నీరజ్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ కుమార్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ సింగ్ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచినీటి పథకానికి అవసరమయ్యే పైపులను సరఫరా చేయడానికి సంసిద్దత వ్యక్తం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమకు పైపుల తయారీ లొకేషన్లు ఉన్నాయని, దేశంలో పైపుల తయారీలో తమదే అగ్రస్థానమని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పైపులు సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నామని, తయారీ కేంద్రాన్ని కూడా తెలంగాణలోనే నెలకొల్పుతామని ముఖ్యమంత్రికి చెప్పారు. ఉక్కు పరిశ్రమల స్థాపనలో కూడా తమకు అనభవం ఉన్నదని, తెలంగాణలో ఉక్కు పరిశ్రమ స్థాపించే అవకాశం ఇవ్వాలని కోరారు....
Hyderabad |Feb 18, 2015 12:00 AM
కేరళలో జరిగిన 35వ జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ క్రీడల్లో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు పతకం సాధించడం విశేషం అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ క్రీడాకారులు తక్కువ కాలపు శిక్షణ, పరిమిత అవకాశాల నేపధ్యంతోనే ఈ ఘనత సాధించారని అన్నారు. వచ్చే జాతీయ క్రీడల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఇప్పటినుండే కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు...
Hyderabad |Feb 17, 2015 12:00 AM
తెలంగాణ, మహరాష్ట్ర మధ్య నిర్మించ తలపెట్టిన అంతరాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలంగాణ, మహరాష్ట్ర ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. ముంబాయిలోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రులు ఇద్దరూ మంగళవారం సమావేశమయ్యారు. మంత్రులు టి.హరీష్‌రావు, జోగురామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపీలు బి. వినోద్‌కుమార్, బివి.పాటిల్, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కె.జోషి, ఇఎన్సి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు....
Hyderabad |Feb 17, 2015 12:00 AM
Chief Minister Sri K.Chandrashekar Rao called on Sri Vidyasagar Rao Hon'ble Governor of Maharastra at Rajbhavan, Mumbai. MPs Sri K Keshava Rao, Sri Jitender Reddy, Sri Vinod Kumar, Ministers Sri Harish Rao, Sri Jogu Ramanna, Parliamentary Secretary Sri Jalagam Venkatrao, Government Representative in New Delhi Sri Venugopala Chary, MLC Sri Karne Prabhakar, Government Advisor Sri Vidyasagar Rao and CMO staff were also present....
Delhi |Feb 16, 2015 12:00 AM
CM K Chandrashekar Rao has called on PM Sri Narendra Modi in New Delhi. During the meeting, the CM requested hon'ble PM to extend financial cooperation for two major development programs taken up by Telangana State Government - Mission Kakatiya and Water Grid....
Hyderabad |Feb 14, 2015 12:00 AM
లక్షల మందిలో కొందరికి మాత్రమే ప్రజా ప్రతినిధిగా పనిచేసే అరుదైన అవకాశం వస్తుందని, దీన్ని సద్వినియోగపరుచుకుని సేవలు అందించి ప్రజల మనస్సుల్లో నిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. టూరిజం ప్లాజాలో శనివారం జరిగిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శులు వినయభాస్కర్, జలగం వెంగల్రావు, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ. గోపాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం, సౌకర్యాల కల్పన కోసం కృషి చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నగరాలు, పట్టణాలలో పరిస్థితి ఏమి బాగాలేదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితి నుండి అన్ని నగరాలు, పట్టణాలు అద్బుతంగా తయారయ్యేందుకు అవసరమైన ప్రణాళికలు వేసుకొని ముందుకు పోవాలన్నారు. ముఖ్యంగా చాలా నగరాలు పట్టణాల్లో ప్రజలకు సురక్షిత నీరు అందడం లేదని, వచ్చే కొద్దిపాటి నల్లా నీరు కూడా ప్రతిరోజు రావడం లేదన్నారు....
Delhi |Feb 15, 2015 12:00 AM
Telangana state has been awarded for outstanding performance in promotion of renewable energy. The Union ministry of New and Renewable energy, appreciated Telangana for its achievement at the first Renewable Energy Global Investment and Expo Re-INVEST, held in New Delhi on the 15th of February, 2015. Telangana Energy Minister Sri G Jagadish Reddy received the award from Prime Minister Sri. Narendra Modi. Chief Minister Sri K Chandrasekhar Rao expressed his happiness at the Prime Minister lauding the achievement of the state. He said such recognition further motivates the state government...
Hyderabad |Feb 14, 2015 12:00 AM
The first ever Photonics valley in the world will be coming-up in Telangana State shortly. Towards this a Memorandum of Understanding has been signed by Sri. Harpreet Singh, Secretary Information Technology Government of Telangana and Dr. Birendra Raj Dutt CEO & CTO M/s PhotonIC Corporation, Los Angeles, California, United States of America. The MoU was signed in the presence of Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao and IT& Panchayat Raj Minister Sri. KT Rama Rao in the CM’s Camp Office this morning....
Hyderabad |Feb 13, 2015 12:00 AM
Sri P.K. Abdurub Honourable Minister for Education, Government of Kerala called on the Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao at Secretariat this evening. Kerala Education Minister informed the Chief Minister that the Kerala Cabinet has approved allotment of 5 acres of Land at Sabarimala for construction of Telangana Bhavan as requested by the Chief Minister. The discussion between both of them rotated around Kerala’s tourism, prohibition in Kerala, growing of Paddy, Coconut growing, total literacy in Kerala and introduction of e-literacy in Kerala. The Education Minister also said that Kerala is full of greenery and there is no rainfall problem in the state. He also said that most of the people from Kerala migrate to other places for better living...
Hyderabad |Feb 12, 2015 12:00 AM
శతాబ్ద కాలంగా అనేక రకాల గోస పడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరు పాళ్లు రావాలంటే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జిహెచ్ఎంసి కమీషనర్, సిటి పోలీస్ కమీషనర్, జెన్కో చైర్మన్, టిఎస్ఐఐసి ఎండి, ఇడి, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు వంద సంవత్సరాలుగా పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న ఇబ్బందులను, మారుతూ వస్తున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించారు. నిజాం పాలన మంచి చెడులు, రజాకర్ల అవిర్భావం-ప్రభావం, సైనికపాలన, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 ఉద్యమం, ఇడ్లి సాంబారు గో బ్యాక్ ఉద్యమం, గైర్ ముల్కి గోబ్యాక్ ఉద్యమం, 2001 నుంచి రాజకీయ పోరాటం, మధ్యలో వచ్చిన వివిధ రకాల ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రారంభంలో పడుతున్న కష్టాలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి భావోద్వేగంగా, సోదాహరణలతో అధికారులకు విడమర్చి చెప్పారు. ఈ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మంచి పద్దతిలో ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులుగా తమకు, అధికార యంత్రాంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న అధికారులకు ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాలనలో మూడు భాగాలు ఉన్నాయన్నారు. ఒకటి... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రెండు... కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మూడు... అధికారులు వీరంతా కలిస్తేనే, సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు....
Hyderabad |Feb 11, 2015 12:00 AM
తెలంగాణ ఉద్యమ సమయంలో బోర్ల రాంరెడ్డిగా సుపరిచితుడైన బైరెడ్డి రాంరెడ్డికి బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నుంచి అపూర్వ ఆదరణ లభించింది. తన గ్రామం, తన మండలం, తన జిల్లాకు సంబంధించిన పలు అంశాలను విన్నవించుకునేందుకు రాంరెడ్డి బుధవారం హైదరాబాద్ వచ్చారు. అపాయింట్మెంట్ కోరిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికే రావాలని ఆహ్వానించారు. దీంతో రాంరెడ్డి తన తోటి గ్రామస్తులతో సిఎం క్యాంపు కార్యాలయనికి చేరుకున్నారు. రాంరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, ఆయనతో కలిసి భోజనం చేశారు. యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర అవతరణ తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సిఎం తన కారులోనే రాంరెడ్డిని ఎక్కించుకుని సచివాలయం వచ్చారు. నేరుగా తన ఛాంబర్ లోకి తీసుకెళ్లారు. అక్కడ పలువురు ఉన్నతాధీకారులకు రాంరెడ్డిని పరిచయం చేశారు. ఉద్యమ సమయంలో రాంరెడ్డి గోసను యావత్ తెలంగాణకు వివరించిన విధానాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నల్గొండ జిల్లా, ముషంపల్లికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి నీళ్ల కోసం తన వ్యవసాయ భూమిలో 67 సార్లు బోర్లు వేసి ఆర్ధికంగా చితికి పోయాడు. అయన బాధను కెసీఅర్ అనేక సందర్భాల్లో, అనేక సభల్లో చెప్పారు. తెలంగాణలో రైతులు ఎంత గోస పడుతున్నారో చెప్పడానికి రాంరెడ్డి ఉదంతాన్ని చెప్పేవారు. కెసీఅర్ స్వయంగా బైరెడ్డి రాంరెడ్డి పేరును బోర్ వెల్ రాంరెడ్డిగా సంబోధించేవారు. అయన దీనస్థీతిని ప్రధాన ఇతివృత్తం చేసుకుని 'స్టిల్ సీకింగ్ జస్టిస్' పేరుతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. ఆ డాక్యుమెంటరీని ఢిల్లీలో కూడా ప్రదర్శించారు. ఇవన్ని సంగతులను ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేసుకున్నారు. గోసపడ్డ తెలంగాణ బాగు పడాలన్నదే తన తపన అని ఈ సందర్బంగా రాంరెడ్డి చెప్పారు....
Hyderabad |Feb 10, 2015 12:00 AM
The following letter is written by Hon'ble CM to Shri Arvind Kejriwal: Dear Arvind KejriwalJi, Please accept my hearty congratulations on the fantastic victory of Aam Aadmi Party in the Delhi Assembly elections. It is a clear indication that voter by and large and particularly the urban voter wants a change and they rightly voted to you and your party....
Delhi |Feb 07, 2015 12:00 AM
CM Sri K Chandrashekar Rao met Union Minister of Health and Family Welfare Sri Jagat Prakash Nadda in New Delhi. During the meeting, CM requested the Union Minister to accord necessary permissions to convert Bibinagar NIMS into AIIMS facility. CM explained to the minister that the Telangana government is planning to set up a Super Specialty hospital, a Medical College, A Dental College and a Nursing College with Hostel facility at Bibinagar. CM also appealed to the Union minister to extend cooperation...
Hyderabad |Feb 05, 2015 12:00 AM
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు అయిన సంతపురి రఘువీర్ రావు (84) మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన రఘువీర్ రావు 1969 లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అనేక ప్రాంతాల్లో పర్యటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. టిఆర్ఎస్ ఆవిర్బావ సమయంలో కూడా తనకు అండదండగా నిలిచారని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుని గానే కాకుండా, పాత్రికేయునిగా కూడా రఘువీర్ రావు సేవలు అందించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అసెంబ్లీలో ట్రాన్స్‌లేటర్ గా కూడా విధులు నిర్వహించిన రఘువీర్ రావు కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికి స్వయంగా సెక్రటేరియట్‌కు వచ్చి తనను ఆశీర్వదించిన సందర్బాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జైలు శిక్ష కూడా అనుభవించిన రఘువీర్ రావు తనలాంటి వారికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు....
Hyderabad |Feb 04, 2015 12:00 AM
2018 చివరి నాటికి తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారాలని, అందుకోసం అధికారులు కాలపరిమితితో కూడిన ప్రణాళికను సిద్దం చేసుకుని కార్యాచరణలో ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ సలహదారు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టిఎస్ సిపిడిఎల్ సిఎండి రఘురామరెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుబాటులో వున్న విద్యుత్, వచ్చే ఏడాదికి అందుబాటులోకి వచ్చే విద్యుత్, ప్రతి ఏటా జరగాల్సిన పురోగతి, అంతిమంగా సాధించాల్సిన లక్ష్యాలు, అందుకు అనుసరిస్తున్న మార్గాలు, విద్యుత్ విధానాలపై సుదీర్ఘ చర్చ జరిగింది....
Hyderabad |Feb 03, 2015 12:00 AM
Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao decided to observe Telangana Martyrs Memorial Day on 2nd June every year in all the districts of Telangana State. On this occasion, there will be an official programme in every district head quarters which include paying floral tributes at the designated sites of Martyrs Memorials besides other programmes in a befitting manner....
Hyderabad |Feb 03, 2015 12:00 AM
The Honourable Chief Minister Sri. K. Chandrasekhar Rao in a letter addressed to Smt. Vasundhara Raje, Hon’ble Chief Minister of Rajasthan has requested to allocate 1-2 acres of Government land for construction of Guest House – “Facilitation Centre-cum-Rubaath” at Dargah Hazrat Khaja Moinuddin Chishti Gharib Nawaz (RA) at Ajmer in Rajasthan State with an estimate cost of Rs. 5.00 Crs. (Five Crores)....
Hyderabad |Feb 03, 2015 12:00 AM
The Ministry of Coal has issued orders for allotment of 36 Coal Blocks to power projects, wherein end-use has been specified prescribing certain norms and parameters...
Hyderabad |Feb 03, 2015 12:00 AM
Honorable Chief Minister Sri. K. Chandrashekar Rao in a letter addressed to Honorable Prime Minister Sri Narendra Modi has requested for allocation of surplus power from Eastern Grid to Telangana in view of severe shortage of power in the coming four months. The letter is as detailed below: "The State of Telangana, ever since its inception on 2.6.2014, has been experiencing acute power shortage. The situation is further compounded by the fact that the State of Andhra Pradesh, for reasons best known to them is not honouring the provisions of the State Reorganisation Act, 2014, and existing Power Purchase Agreements (PPAs)....
Hyderabad |Jan 31, 2015 12:00 AM
హైదరాబాద్ నగరంలోని ప్రజలు కనీస అవసరాలు కూడా పూర్తి స్థాయిలో తీర్చుకోలేకుండా దుర్బరమైన పరిస్థితి ఎదుర్కోవడం అత్యంత దారుణమైన విషయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగరాన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్ మరింత ఘోరంగా తయారవుతుందని, ఇప్పుడు హైదరాబాద్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌కు పట్టిన జబ్బు వదలాలంటే మాములు వైద్యం సరిపోదని శస్త్ర చికిత్స చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నగరంలోని మోండా మార్కెట్‌ను సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి నగరంలో ప్రజల అవసరాలకు సంబంధించిన పలు అంశాలపై విస్త్రుతంగా చర్చ జరిపారు....
Hyderabad |Jan 31, 2015 12:00 AM
నిజాం రాజులు కట్టించిన మోండా మార్కెట్‌ను ఆధునీకరించి అభివృద్ది పరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ను శనివారం ముఖ్యమంత్రి సందర్శించారు. 143 సంవత్సరాల క్రితం 1872 లోనే అప్పటి నిజాం రాజు ఎంతో ముందు చూపుతో నిర్మించిన మోండా మార్కెట్ నేటికి చెక్కు చెదరలేదని ముఖ్యమంత్రి అన్నారు. కూరగాయల షాపులను, మాంసాహార షాపులను, ఇతర గృహోపయోగ వస్తువులు విక్రయించే షాపులను ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ కాలంలోనే రెండు మూడు ఫీట్ల ఎత్తు గద్దెలు నిర్మించి కూరగాయలు అమ్మేందుకు కేటాయించడాన్ని ముఖ్యమంత్రి గమనించారు. మటన్ షాపులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మించడాన్ని ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు. మటన్ మార్కెట్లో విశాలమైన గదులు ఉండడంతో పాటు ఈగలు, దోమలు రాకుండా జాలి కూడా పెట్టారు. అప్పుడు పెట్టిన జాలి ఇప్పటి వరకు చెక్కు చెదరక పోవడాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మార్కెట్లో కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, ఇతర వస్తువులు అమ్మేవారితో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్కెటంతా దాదాపు 40 నిమిషాల పాటు కలియతిరిగారు. ఈ మార్కెట్‌ను అభివృద్ది చేస్తామని హామినిచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, జిహెచ్ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్ తదితరులు ఉన్నారు....
Hyderabad |Jan 28, 2015 12:00 AM
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామి మేరకు రాష్ట్రంలో నిలువ నీడ లేని నిరుపేదలకు రెండు బెడ్ రూములతో కూడిన నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ కొత్త గృహ నిర్మాణ పథకం ఎలా ఉండాలి? లబ్దిదారుల ఎంపిక ఎలా జరగాలి? గతంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిర్మాణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? తదితర విషయాలపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్త్రుత చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు టి. హరీష్‌రావు, కె.టి.రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ సలహాదారు బివి.పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు మహేష్‌దత్ ఎక్కా, దానకిషోర్, బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు....
Warangal |Jan 28, 2015 12:00 AM
వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సచివాలయంలో బుధవారం మున్సిపల్ కార్యదర్శి ఎంజీ.గోపాల్, మున్సిపల్ శాఖ కమీషనర్ బి. జనార్దన్‌రెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్, హన్మకొండ, కాజిపేట పట్టణాలతో కూడిన వరంగల్ నగరం తెలంగాణలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతమని ముఖ్యమంత్రి అన్నారు. పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో రాష్ట్ర రాజధానికి ధీటుగా వరంగల్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్లో కొద్ది కాలం క్రితమే 42 గ్రామ పంచాయతీలు కూడా కలవడంతో నగరం బాగా విస్తరించిందని, నగర జనాభా దాదాపు 10 లక్షలకు చేరువయ్యిందని చెప్పారు....
Hyderabad |Jan 27, 2015 12:00 AM
పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పాటు హైదరాబాద్‌కు ఉన్న సానుకూల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమైనదిగా విశ్వవ్యాప్తంగా అనేక సంస్థలు భావిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. కెనడాకు చెందిన FAIRFAX కంపెనీ చైర్మన్ ప్రేమ్‌వత్స నేతృత్వంలోని ప్రతినిధులు బృందం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. FAIRFAX FINANCIAL HOLDINGS భారతదేశంలో వివిధ రంగాల అభివృద్దికి ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నది. అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రణాళిక సిద్దం చేసింది. ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడానికి ఈ బృందం వచ్చింది. తెలంగాణలో ఇంకా ఏ ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టవచ్చనే విషయంపై ముఖ్యమంత్రిని సంప్రదించారు....
Hyderabad |Jan 26, 2015 12:00 AM
ప్రముఖ కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన సృజనాత్మకతకు సున్నితమైన హాస్యం జోడించి ఆర్.కె.లక్ష్మణ్ వేసిన కార్టూన్లు సామాన్యుల మనోభావాలను వ్యక్తీకరించేవని ముఖ్యమంత్రి అన్నారు. యూనివర్సిటీలు ఇచ్చే డాక్టరేట్లు మొదలుకొని భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డుల వరకు అనేక గౌరవాలు దక్కించుకున్న అరుదైన వ్యక్తి అని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్.కె.లక్ష్మణ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Hyderabad |Jan 24, 2015 12:00 AM
The Honourable Chief Minister Sri. K. Chandasekhar Rao thanked the Union Minister of Railways Sri. Suresh Prabhu for agreeing to his request not to levy “Traffic block” charges for permitting crossing over the rail lines at eight designated sites across the three metro rail corridors in twin cities. It may be recalled that in a recent meeting the Honourable Chief Minister raised this issue with the Union Minister of Railways and he immediately responded by resolving the issue....
Hyderabad |Jan 23, 2015 12:00 AM
వైద్య పరమైన సమస్యలు,సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనప్పుడే కాకుండా ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా సమర్దంగా ఎదుర్కునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ముఖ్యమంత్రిని కలిసింది. కేంద్ర ప్రజారోగ్య శాఖ అడీషినల్ డైరెక్టర్ జనరల్ డా.అశోక్‌కుమార్, డా.శశిఖరే, డా.ప్రదీప్, డా. మహేష్, డా.ప్రణయ్ కుమార్‌లతో కూడిన బృందం నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులను సందర్శించింది. అనంతరం వారు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా బృందానికి నేతృత్వం వహించిన డా.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్‌ప్లూ ప్రభావాన్ని తెలంగాణలో బాగా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయన్నారు. స్వైన్‌ప్లూ పై యుద్దం ప్రకటించి రాష్ట్ర రాజధాని నుండి ఏరియ ఆసుపత్రుల వరకు మందులను అందుబాటులో ఉంచడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించండంలో కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో, దేశంలోని చాలా రాష్ట్రాల్లో స్వైన్‌ప్లూ ప్రభావం ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా స్వైన్‌ప్లూ చలి కాలంలో వ్యాప్తిస్తుందని కూడా వెల్లడించారు. స్వైన్‌ప్లూపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్త్రుత ప్రచారం నిర్వహించిందని చెప్పారు. స్వైన్‌ప్లూ బాధితులకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయమని, ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడం వల్ల పేదలు కూడా వైద్యం చేయించుకోగలిగారని డా.అశోక్‌కుమార్ చెప్పారు. వచ్చే ఐదేళ్ల వరకు కూడా సరిపోయే మందులు తెలంగాణ రాష్ట్రం అందుబాటులోకి తెచ్చుకున్నదని కేంద్ర బృందం ప్రశంసించింది....
Hyderabad |Jan 22, 2015 12:00 AM
Chairman and Managing Director Singareni collieries company Sri N.Sridhar today handed over a cheque for Rs. 132.84 crores to Honourable Chief Minister of Telangana Sri K.Chandrashekar Rao as dividend for the year 2013-14 in the presence of Sri C.Laxmareddy, Hon’ble Minister for power, Sri S.Narsing Rao, Principal Secretary to Chief Minister and Secretary Energy Sri Aravind Kumar. Singareni collieries is a State Owned enterprise having 51 percent equity held by Government ofTelangana and 49 percent by Government of India. The company’s paid up equity capital is Rs. 1733 crores....
Hyderabad |Jan 22, 2015 12:00 AM
The first Cultural Tableau of Telangana State is coming up at Rajpath, New Delhi on the eve of Republic Day Celebrations. 25 Artists are being perfectly trained for performing the "Bonalu Festival" of Telangana State which is also the first state festival. The Cultural Tableau is to be displayed in the 9th position in the Cultural Pageant, out of the 25 Tableau....
Hyderabad |Jan 21, 2015 12:00 AM
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విస్తరించిన స్వైన్‌ప్లూ ప్రభావాన్ని తెలంగాణలో వీలైనంత తగ్గించడానికి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్వైన్‌ప్లూ పై సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డా.టి.రాజయ్య, మంత్రులు టి.హరీష్ రావు, టి.నాగేశ్వర్ రావు, ఎంపి బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మున్సిపల్ శాఖ కార్యదర్శి గోపాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ప్రసాద్, పంచాయతిరాజ్ శాఖ కార్యదర్శి రేమాండ్ పీటర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ జనార్దన్‌రెడ్డి, జిహెచ్ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్, డిఎంఇ పుట్ట శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్,మెడికల్ హెల్త్ డైరెక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా స్వైన్‌ప్లూ విస్తరిస్తున్న విధానాన్ని, రాష్ట్రంలో పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వైన్‌ప్లూ వ్యాధిపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. సమీక్షా సమావేశం నుంచే ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకాష్ నడ్డాతో మాట్లాడారు. అంతకుముందే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడితో మాట్లాడారు....
Hyderabad |Jan 21, 2015 12:00 AM
స్వైన్ ప్లూ వ్యాధి ప్రబలడంఫై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అందోళన వ్యక్తం చేశారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ స్తబ్దుగా ఉండడం పట్ల సిఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో సిఎం ఫోన్లో మాట్లాడారు.స్వైన్ ప్లూఫై చర్చి౦చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా మాట్లాడారు. ఈరోజే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించి, మద్యాహ్న౦లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తాను కూడా సమీక్షలో పాల్గొనాలని నిర్ణయించారు. మరో 20 రోజుల పాటు చలిగాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమతంగా ఉండాలన్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ప్రజలకు స్వైన్ ప్లూ నిరోధకవ్యాక్సిన్ అందివ్వాలని సిఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. స్వైన్ ఫ్లూపై యుద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు....
Hyderabad |Jan 20, 2015 12:00 AM
నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛయైన నక్కలగండి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయడం పట్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటరి కార్యదర్శి జి. కిషోర్, యం.పి బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జెడ్పి చైర్మెన్ బాలునాయక్ తదితరులు మంగళవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు నల్గొండ జిల్లాకు త్రాగు సాగు నీరు అందించడంలో నిర్లక్ష్యం చూపారని, ముఖ్యమంత్రి కెసిఆర్ నల్గొండ జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని వారన్నారు....
Hyderabad |Jan 19, 2015 12:00 AM
Honourable Chief Minister Shri. K. Chandrasekhar Rao has brought to the notice of Union Minister for Railways Shri. Suresh Prabhu various pending railway projects and several other issues pending with the railways. The Union Minister for Railways Shri. Suresh Prabhu along with South Central Railway General Manager Shri. P.K. Srivastava called on the Honourable Chief Minister at secretariat this afternoon. The Honourable Chief Minister also told the Union Minister that there is a need for drastic change in the approach of the railway department and in the process suggested several measures to be initiated and taken up by the Railway Ministry. The Chief Minister said that in view of the increasing population of Hyderabad and Secunderabad the Moulali and Nagulapally Railway Stations need to be upgraded and developed in to fulfledged terminal stations in order to ease pressure on Secunderabad Railway station. The Chief Minister has also requested the Union Minister that the name of the present AP Express to be changed as Telangana Express....
Begumpet |Jan 18, 2015 12:00 AM
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు ఏ మాత్రం అశ్రద్ద చేయకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. వైద్య సిబ్బంది కూడా మారుమూల ప్రాంతాల్లో తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, ఏ ఒక్క చిన్నారినీ విస్మరించవద్దని సూచించారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, వైద్య శాఖ కార్యదర్శి సురేష్‌చంద, జిహెచ్ఎంసి కమీషనర్ సోమేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....
Hyderabad |Jan 17, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుండి 33 శాతానికి పైగా ఉండేలా చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణను నిలపాలని కోరారు. అటవీ శాఖలోని ఖాళీలు భర్తీ చేస్తామని, వేతన సవరణ చేస్తామని, వాహన సౌకర్యం కల్పిస్తామని, పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నగర శివారులోని దూలపల్లిలోని ఫారెస్టు అకాడమీలో శనివారం రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అటవీ శాఖలోని రేంజర్లు, డిఎఫ్ఓలు, కన్సర్వేటర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ భూమి అన్యాక్రాంతానికి గురువుతున్నదని, దాని రక్షణకు పాటు పడే సందర్బంలో ప్రాణ హాని కూడా జరుగుతున్నదని ముఖ్యమంత్రికి అటవీ శాఖ అధికారులు విన్నవించారు. స్మగ్లర్లు, భూ ఆక్రమణ దారులు, గుత్తి కోయల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కొంత మంది ఫారెస్టు అధికారులు స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన సంఘటనలు కూడా అధికారులు చెప్పడంతో ముఖ్యమంత్రి చలించిపోయారు. అటవీ శాఖ ఆక్రమణల పట్ల, కలప స్మగ్లర్ల పట్ల అంత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు....
Warangal |Jan 11, 2015 12:00 AM
వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో తాను పర్యటించిన కాలనీలలో మిగిలిపోయిన పెన్షన్లు, రేషన్ కూపన్లను ఆదివారం అందివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మురికి వాడల్లో నివసించే పేదలకు పక్కా ఇండ్లు కట్టించే కార్యక్రమానికి కూడా ఆదివారమే శ్రీకారం చుట్టనున్నారు. మూడు కార్యక్రమాలను తానే స్వయంగా ప్రారంభిస్తానని సిఎం వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక ఇంటిపై మరొకటి 1+1శ్రీ ఈ రెండు పద్దతిన గృహ నిర్మాణం జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడున్న పేదలతో పాటు, ఇతర పేదలకు కూడా వాటిని కేటాయించాలన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మిపురం, సాకరాజుకుంట, గిరిప్రసాద్‌నగర్ కాలనీలు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అబెండ్కర్ నగర్, ప్రగతినగర్, దీనదయాల్ కాలనీ పరిధిలోని పేదలందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు అందివ్వాలని సిఎం ఆదేశించారు. పక్కా గృహాలు నిర్మించే లే అవుట్లో అంగన్వాడి లాంటి సామాజిక అవసరాల కోసం స్థల కేటాయింపు జరపాలని చెప్పారు. కాలనీలలో రెండు బెడ్ రూములు, హాలు, వంటగది, రెండు బాత్రూములు ఉండే 1+1 ఇండ్లు కట్టాలని, కాలనీలలో రహదారులు, డ్రైనేజీలు కట్టాలని, మంచినీటి పైపులైన్లు వేయాలని సిఎం చెప్పారు....
Hyderabad |Jan 09, 2015 12:00 AM
అత్యుత్తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న తెలంగాణ జెన్కొ దేశంలోని అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పత్తి జరగాలనే తన సంకల్ప బలాన్ని జెన్కో ఉద్యోగులు తమ పనితనంతో బలపరుస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కే.టి.పి.టిని ముఖ్యమంత్రి శుక్రవారం సందర్శించారు. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అడుగడుగు తిరిగి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనుల పురోగతిని సమీక్షించారు. 500 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రంలో వందకు వంద శాతం ఉత్పత్తి పిఎల్ఎఫ్ సాధిస్తున్నందుకు అభినందించారు. భూపాలపల్లి విద్యుత్ ప్లాంట్ సగటున 95.08 శాతం పిఎల్ఎఫ్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశంలోనే అత్యుత్తమ రికార్డు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించే దిశలో ఇలాంటి ఫలితాలు ఎంతో స్పూర్తిని ఇస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సమస్యను అధిగమించేందుకు, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు కావలసిన 10,000 మెగావాట్ల అదనపు థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో 6000 మెగావాట్లు జెన్కో ద్వారా, 4000 మెగావాట్లు ఎన్టిపిసి ద్వారా ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల కన్నా తనకు ప్రభుత్వ రంగ సంస్థలపైనే నమ్మకం ఎక్కువ అని, ప్రభుత్వ ఉద్యోగులపైనే తనకు అచంచల విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణలో బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నప్పటికి ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు పెట్టే విషయంలో సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగా వ్యవహరించాయన్నారు....
Warangal |Jan 08, 2015 12:00 AM
వరంగల్ నగరం రానున్న రోజుల్లో శరవేగంగా అభివృద్ది చెందుతుంది కాబట్టి ఇప్పటి నుండే నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముఖ్యంగా రవాణా రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. గురువారం రాత్రి మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ముఖ్యమంత్రి వరంగల్ నగర రవాణా వ్యవస్థపై సమీక్ష జరిపారు. 150 ఫీట్ల మేర విస్తరించాల్సిన 5 రహదారులను గుర్తించారు. 1. మడికొండ నుండి హన్మకొండ చౌరస్తా మీదుగా నర్సంపేట రోడ్డు వరకు, 2. హంటర్ రోడ్డు, 3. ఆర్ఇసి-కేయుసి రోడ్డు, 4. పెట్రోల్ పంపు- కరీంనగర్ రోడ్డు, 5. కడిపికొండ బైపాస్ రోడ్డు. వరంగల్ నగరంలో ప్రస్తుతం ఉన్న రెండు బస్టాండ్లు నగరం మధ్యలో ఉన్నాయని, వీటికి అదనంగా మరో రెండు బస్ టెర్మినల్స్ విశాలంగా నిర్మించాల్సి ఉందన్నారు. వరంగల్, ఖాజిపేట రైల్వే స్టేషన్లలో కూడా భవిష్యత్తులో రద్దీ పెరుగుతుందని, దీనికి అనుబంధంగా కూడా రైల్వే స్టేషన్ల విస్తరణ జరగాల్సి ఉందన్నారు. దాని కోసం స్థల సేకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఫ్లైఒవరు, అండర్ వే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు....
Warangal |Jan 06, 2015 12:00 AM
మిషన్ కాకతీయ పైలాన్ నమూనాను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి గుర్తుగా ఈ పైలాన్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తారు. నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్‌రావు పర్యవేక్షణలో ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు పైలాన్ రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి ఈ నమూనాకు ఆమోదం తెలిపారు. తెలంగాణలోని దాదాపు 46 వేల చెరువులను పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందులో భాగంగా మొదటి ఏడాది 9 వేల చెరువులను పునరుద్దరిస్తుంది.జనవరి మూడవ వారంలో ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో 20 అడుగుల ఈ పైలాన్‌ను ఆవిష్కరింపజేసి మిషన్ కాకతీయను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో వేలాది చెరువులు తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టింది. వరంగల్ రాజధానిగా కాకతీయుల రాజ్యం ఉండడంతో పాటు, లక్నవరం, పాకాల, రామప్ప, ఘనపురం, ధర్మసాగరం లాంటి పెద్ద చెరువులు వరంగల్ జిల్లాలోనే ఉన్నందున జిల్లా కేంద్రంలోనే పైలాన్ ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్ భావిస్తున్నారు....
Hyderabada |Jan 02, 2015 12:00 AM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించడం ద్వారా అందరి ఆరోగ్యం రక్షించాలనే ఆశయం కూడా వుందని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎక్కువ శాతం వ్యాధులు మంచినీరు తాగకపోవడం వల్లనే వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పూర్తయి, ఇంటింటికీ మంచినీరు ఇచ్చిన తర్వాత తెలంగాణలో రోగాలు తగ్గుతాయని, ఆరోగ్యకరమైన మానవ వనరులు అందుబాటులో వుంటాయని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ నీటి వనరుల గుర్తింపు, అలైన్ మెంట్ ఖరారు , వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల స్థాపన తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కె.తారక రామారావు, జి.జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పంచాయతీరాజ్ కార్యదర్శి రేమాండ్ పీటర్, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు బాబురావు, చక్రపాణి, బి.సురేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు ఉమాకాంతారావు, రిటైర్డ్ అధికారులు విశ్వనాధ్, మనోహర్ బాబు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు....
Hyderabad |Dec 31, 2014 12:00 AM
తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు అయ్యే వ్యయానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ రంగమే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది తన అభిమతమని సిఎం చెప్పారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి జెన్కో చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన బిహెచ్ఇఎల్కు మొదటి విడత నిధులు అందించారు. రూ. 3,810 కోట్లతో కొత్తగూడెంలో 800 మెగావాట్లు, మణుగూరులో రూ. 4,200 కోట్లతో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బిహెచ్ఇఎల్ నిర్మిస్తున్నది....
Hyderabad |Dec 30, 2014 12:00 AM
ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు అందించే తెలంగాణ వాటర్ గ్రిడ్ పనులను చిత్తశుద్దితో, వేగంగా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వాటర్‌గ్రిడ్‌పై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతిరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పంచాయతిరాజ్ కార్యదర్శి రేమాండ్ పీటర్ తదితరులు పాల్గొన్నారు....
Hyderabad |Dec 29, 2014 12:00 AM
Honourable Chief Minister Sri. K. Chandrasekhar Rao has issued orders appointing Sri. Vodithela Satish Kumar, MLA, Husnabad and Sri. Gadari Kishore Kumar, MLA, Tungathurthi as Parliamentary Secretaries in addition to the four already appointed....
Hyderabad |Dec 29, 2014 12:00 AM
Inspired by the Telangana model, Government of Bihar has taken a decision in principle to start residential schools for SCs in their State. Following directions given by its Chief Minister, Mr Majhi, Social Welfare Department had sent six teams to study educational facilities for SCs in various states. Telangana was one of such states. The team that toured the residential schools of Telangana was so impressed with Telangana model that they wanted to replicate the same immediately in Bihar to benefit 1.25 lakh children in phases....
Warangal |Dec 29, 2014 12:00 AM
వరంగల్ నగరం హైదరాబాద్ తరువాత రెండవ అతిపెద్ద నగరమని, దీనిని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భారతదేశ వస్త్ర పరిశ్రమ అంతా ఒకేచోట ఉండే విధంగా దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో నెలకొల్పుతామని ప్రకటించారు. ప్రస్తుత ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌లోని రహదారులను, జంక్షన్లను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయ ఉత్సవాలు కూడా కేవలం వరంగల్‌కే పరిమితం కాకుండా దేశ ప్రజలందరూ గుర్తించేలా నిర్వహించాలని చెప్పారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో నగరంలోని రహదారులు, జంక్షన్ల అభివృద్ది, కాకతీయ ఉత్సవాల నిర్వహణ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నుండి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు....
Hyderabad |Nov 29, 2014 12:00 AM
Government of China’s Sichuan province has extended an invitation to Honorable Chief Minister Sri.K.Chandrashekar Rao and his companying delegation from the Telangana state to visit Chengdu, Sichuan rovince, to strengthen friendly relations between Telangana state and Sichuan province, in view of promoting business and cultural cooperation etween these two....