- The CM briefs Central Team about crop damages and loss of infrastructure
- Flood damage is estimated at a staggering Rs 10,320 crores
Chief Minister Sri A Revanth Reddy has again requested the Union Government to extend immediate financial assistance to the flood affected Telangana state which suffered huge rain related damages. The Chief Minister urged all out help from the centre without any conditions to provide relief to the affected people in the state. The CM also emphasized that the strict rules which are being implemented by the centre for the utilization of the disaster funds should be relaxed.
CM Revanth Reddy brought to the notice of the central team about the hurdles being faced by the state government in the utilization of at least one rupee from the available Rs 1350 crore NDRF funds, even if the state is submerged, due to the stringent central regulations. The guidelines have prescribed the utilization of only Rs one lakh for the repair of damaged roads on a one km stretch, the CM said that it would not be possible to take up even temporary repairs of the damaged roads with such meager charges for repairs fixed by the centre.
The Chief Minister said that the details of the SSR rates in the state will also be included in the flood damage report which is to be submitted to the Centre and requested the central team to examine the report and provide disaster relief.
The Chief Minister briefed the central team about the recent heavy rains and colossal damages caused by flood fury in the state. According to the comprehensive estimates compiled by the various departments, the damage incurred due to recent floods and heavy rains is at a staggering Rs 10,320 crores. A final report on the damages is being prepared.
The Chief Minister said that the loss of human lives could be reduced due to the strict vigilance by the ministers and officials in the flood hit areas. Thousands of houses are damaged and crops washed away in the lakhs of acres under the influence of rain fury. The farmers bore the brunt of heavy rains after the agricultural fields were covered with boulders, gravel and mud. The CM explained to the central team that the damage to roads, culverts and lakes exceeded the preliminary enumeration.
CM Revanth Reddy met with a group of central officials who arrived in the state to assess the damages caused by the floods which wreaked havoc in the state. Revenue Minister Ponguleti Srinivasa Reddy, Khammam MP Raghuram Reddy, Chief Minister Advisor Vem Narender Reddy, Chief Secretary Santhi Kumari and other top officials participated in the meeting held at the Secretariat today ( Friday).
The Chief Minister said that the construction of a retaining wall at Munneru Vagu would be a permanent solution to prevent the threat of floods in Khammam town in the future. The CM pleaded with the Centre to allocate adequate funds for the construction of the retaining wall and the state is ready to release its share of funds. The Government will sanction houses to the flood affected people in Rakasi tanda, Satyanarayana thanda and the people of other tribal habitations in the low lying areas in nearby safe areas, the CM said requesting the center to provide necessary assistance for the construction of houses.
CM Revanth Reddy asserted that the centre should focus more on preventive measures instead of providing support after the floods and natural calamities to the affected states. The Chief Minister also suggested to the central team to focus more on making arrangements for early warning of weather and environmental disasters like heavy rainfall and heat waves.
The CM informed the central team that the police battalions located in different districts will be used to help and take immediate relief measures during the floods in the future. Special training will be provided to 100 selected people in each battalion, the CM said the government is seeking the NDRF’s help to provide the necessary equipment, training and skills to tackle natural disasters.
The recent incident of uprooting trees on nearly 50,000 acres in the Medaram forest area also came up for discussion in the meeting. The Chief Minister opined that no human loss was reported since the incident happened in the forest area. A major disaster could have occurred if such a big incident was reported in the plain areas. The central team said that they have not come across such an incident in the country so far. The Chief Minister requested the central team to depute experts to conduct a scientific study on the disaster and also examine the precautions which needs to be taken to prevent such incidents in the future.
A group of central officials from Delhi divided into two groups and toured flood-affected Khammam, Mahbubabad and Suryapet districts for two days. The teams Inspected the damages in the flood affected areas. NDMA advisor Colonel KP Singh is heading the central team and Shantinath Shivappa, Mahesh Kumar, Nayal Kansan, Rakesh Meena and Shashivardhan Reddy are the members.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడున్న నిబంధనలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే, కేవలం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లకు నిర్ణయించారని.. దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెర్వులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు.
రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, హీట్ వేవ్ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి సూచించారు.
భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నపోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామని అన్నారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని అన్నారు.
మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు. అలాంటి సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు బృందాలుగా విడివడి రెండు రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది. భారీ వర్షాలతో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. ఎన్డీఎంఏ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారధ్యంలో ని ఈ బృందంలో కేపీ సింగ్ తో పాటు శాంతినాథ్ శివప్ప, మహేష్ కుమార్, నాయల్ కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్ రెడ్డి ఉన్నారు.