Chief Minister Sri A Revanth Reddy launched “Katamayya Rakshaka Kavacham (Safety Equipment) scheme at Tativanam in Abdullapurmet on Sunday.
CM Revanth Reddy’s speech points:
Goud community supported and campaigned for Congress to come to power in the elections. Goud brothers also propagated that the respect of weaker sections will be enhanced only if the Congress comes to power in Telangana. Gouds are known for fighting spirit and their robustness.
My government is committed to extend assistance to people who relied on traditional occupations. Their experience of climbing Everest is useful for the protection of Goud fraternity. My sincere appreciation to them.
Congress government is striving for the upliftment of the weaker sections. YSR regime introduced fee reimbursement scheme for weaker sections.Government is committed to continue the fee reimbursement scheme.
Government will not object to grow plam and Indian Date Plam trees in the government lands.
Suggest to Excise MinisterJupally Krishna Rao to take up the plantation of Palm and Indian Date Plam in Vanamahotsavam program.
Minister Sridhar Babu should also take initiative to plant such trees on the banks of water bodies , roads, ponds and canals.
The government is committed to protect the culture of the Goud community. Appeal to the community to provide higher studies to their children and make them reach to the higher levels. They should also participate in rebuilding the Telangana state. Your children should grow as law makers. Education is the only weapon for weaker sections to become rulers.
Metro Rail will be extended up to Hayat Nagar soon . All plans have been prepared in this regard.
Government envisaged plans to set up Universities, Medical Tourism Hub and industries in the land acquired for pharma companies.The government will take the responsibility of building a magnificent city at Maheswaram to compete with New York City. The wonderful Rachakonda area, which is similar to Ooty, will also be developed as the hub of Film making Industry.
Rangareddy district will witness huge development soon. Government is planning to promote the district as a wonderful destination for tourists places in the world.
The leaders who lost elections and taking rest in their farm house should be aware of that Out Ring Road, International Airport and Pharma City were developed in the Congress rule. The Previous government developed nothing except promoted Drugs and Ganja smuggling.
The leaders who said Congress was finished are now counting the number of leaders in their party. BRS MLAs are joining the Congress to support the Telangana development.
Rivals conspired to topple my government. In other ways, their leaders are supporting the government. Congress will rule the state for 10 years.
The previous BRS government landed the Telangana State into debt trap. My government is solving every hurdle and moving forward.
The Chief Minister, Assembly Speaker G Prasad and ministers also participated in community lunch with Goud community.
అబ్దుల్లాపూర్ మెట్ లో “కాటమయ్య రక్షణ కవచం” పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్, మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు.
అబ్దుల్లాపూర్ మెట్ లో “కాటమయ్య రక్షణ కవచం” పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు:
- ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారు.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారు.
- పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు..
- కులవృత్తులకు చేయూత అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవం గౌడన్నల రక్షణకు ఉపయోగపడింది.
- వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా…
- బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోంది.
- వైఎస్ఆర్ హయాంలో బలహీన వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చారు.
- ఫీజు రీయింబర్స్ మెంట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు..
- రాష్ట్రంలో వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లికి సూచిస్తున్నా ..
- చెరువు గట్లపై కూడా చెట్లు నాటలా ఇరిగేషన్ విభాగంతో మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచిస్తున్నా..
- రహదారులు, చెరువుగట్లు, కాలువగట్ల వద్ద తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటాం..
- గౌడన్నల కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- కులవృత్తులపై ఆధారపడిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా….
- మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించండి.. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దండి.
- తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి..
- చట్టాలు రూపొందించే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి…
- బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే ఏకైక మార్గం చదువు మాత్రమే..
- త్వరలోనే హయత్ నగర్ కు మెట్రో రాబోతుంది.
- ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి.
- ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
- న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..
- ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నాం..
- రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోంది
- ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతాం
- ఓడిపోయి ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా…
- ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా?
- మీరేం తెచ్చారు… డ్రగ్స్, గంజాయి తప్ప..
- కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి…
- తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా బీఆరెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు…
- మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని వాళ్లు మద్దతుగా వస్తున్నారు..
- పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..
- గత బీఆరెస్ పాలకులు తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు..
- మేం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం..